ఈకాలంలొ వాస్తు దోషాలకు గణపతిని ఆరాధించటం సాధారణంగా కనిపిస్తోంది. వాస్తు దోషాలకు నివారణగా ఇల్లు, ఆఫీసులలో గణపతి ప్రతిమలను వాడటం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అయితే ఉన్న సమస్యను బట్టి ఎంపిక గణపతి రూపన్నీ ఎంపిక చేసుకోవాలని చెప్తున్నారు. అయితే అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.  


ఇంటిలోనిల్చుని ఉన్న గణపతి ఉంటే ఆ ఇంటివారు సంతోషంగా జీవిస్తారు. అయితే నిల్చుని ఉన్న గణపతి దుకాణాలలో లేదా కార్యాలయాల్లో ఉంటే వినియోగదారుల సంఖ్య తగ్గిపోతుంది. అందుకే .. దుకాణాలలో, కార్యాలయాల్లో కూర్చొని ఉన్న గణపతి ప్రతిమనే పెట్టుకోవాలి.


తొండం ఎడమ వైపు తిరిగి ఉన్న గణపతి ప్రతిమను ఇంటి ముఖద్వారంపై ప్రతిష్టించడం వల్ల సకారాత్మ శక్తి తరంగాల ప్రసారం జరుగుతుంది.  


ఏకదంత గణపతిని ప్రతిష్ఠిస్తే నకారాత్మక శక్తి నశించి ధన వృద్ది కలగడమే గాక కుటుంబం లో సమస్యలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి, మంచి ఆలోచనలు , బుద్ది వికాసం ఏర్పడతాయి.


మహోదర గణపతిని ఇంటి మధ్య భాగం లో ప్రతిష్టించడం వలన నకారాత్మక శక్తి ని తొలగిపోతుంది. దృష్టి దోషం తొలగి విఘ్నాలు నివారింపబడతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.


పెద్ద చెవులున్న గణపతిని ప్రతిష్టించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి వృద్ది చెంది, కుటుంబ సభ్యుల మధ్య స్నేహభావం, ప్రేమానురాగాలు ఏర్పడతాయి.  


చూసారుగా ఏ గణపతులను ఎక్కడ పెట్టాలో ? ఎక్కడ పెట్టకూడదో అనేది. వాస్తు ప్రకారం మీకు ఏ సమస్య ఉందొ ఆ సమస్యకు తగ్గట్టు గణపతులను ఇంట్లో ఉంచండి. మంచి జరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: