ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు మంగళవారం, 29.10.2019 ఉదయం 5 గంటల సమయానికి, తిరుమల: 19C°-25℃°.


• నిన్న 81,618 మంది  భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 14 గదిలో భక్తులు వేచి ఉన్నారు.


 • ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు 10 గంటలు  పట్టవచ్చును.


• నిన్న 27,618 మంది భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు.


• నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.13 కోట్లు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును,

గమనిక:


#  ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి  శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.


# ఈరొజు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం, (భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు).


# ఈనెల 30 న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.


వయోవృద్దులు / దివ్యాంగులకు  ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.  ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:


• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


శ్రీవేంకటేశ్వర సుప్రభాతం


!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!


తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి 


మరింత సమాచారం తెలుసుకోండి: