ఒక పిల్లాడు దేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు . బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు .అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక బ్యాగ్ లో రెండు జతల బట్టలు కొన్ని కేకులూ పెట్టుకుని బయలుదేరాడు.నడిచి నడిచి
అలసిపోవడంతో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు...దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు . అక్కడ చక్కని చెట్లు పక్కన ఒక బెంచ్ మీద కూర్చున్నాడు ఆ తర్వాత ఆకలి అనిపించింది . ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు . ఆ బాలుడు ఎదురుగా పక్కన ఒక ముసలి ఆమె ఆకలిగా ఉంది అన్నట్లు చూస్తూ కనబడింది . ఆమె దగ్గరికి వెళ్లి ఒక కేక్ ముక్క పెట్టాడు .


.
ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా ఆ బాబు చల్లగా ఉండాలి అని ఆశీర్వాదంతో నవ్వింది . ఆ నవ్వు ఆ కుర్రాడికి చాలా ఆప్యాయంగా అనిపించింది ఆమె నవ్వు మళ్ళీ చూడాలి అనుకున్నాడు . ఇంకో సారి దగ్గరకి వెళ్లి మళ్ళీ కేక్ ముక్క ఇచ్చాడు . ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది . ఆమె నవ్వును ఆప్యాయతలను చూస్తూ ఉండాలి అనిపించింది . చాలా సేపు అంతా అతను కేక్ అలా ఇస్తున్నాడు . ఆమె తీసుకుంటోంది . నవ్వుతోంది . ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు .సాయంత్రం అయ్యింది . చీకటి పడుతోంది . లేచి వెళ్లి పోదాం అనుకున్నాడు . వెళ్లేముందు పరుగు పరుగున వెనక్కు వచ్చాడు . ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను కౌగలించుకుని ఒక ముద్దు పెట్టాడు . ఆమె కూడా బాలుడిని దగ్గరకు తీసుకుని ఆశీస్సులు ధీవెనలతో ముద్దు పెట్టుకుని తన ఆప్యాయతలు నవ్వును బదులు ఇచ్చింది .
ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేశాడు . అతడి ముఖం లో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన వాళ్ళ అమ్మ అడిగింది .


.
కన్నా ! ఏమిటి రా ! ఈ రోజు నీ ముఖం లో అంత ఆనందం కనబడుతోంది . ఈ రోజు ఏమి జరిగిందిరా ? అని “నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా !” అన్నాడు ఆ కుర్రాడు.అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే “నీకు తెలుసా అమ్మా ! నేను ఇప్పటి వరకూ అంత ఆప్యాయంగా అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు” అన్నాడు ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషం గా చేరింది . ఆమె ముఖం లో కనబడుతున్న ప్రశాంతతను చూసి “ఏమిటమ్మా ! ఇవాళ అంత ఆనందం గా ఉన్నావు ?” తన అడిగాడు కొడుకు .“ఈ రోజు దేవుడిని చూశానురా!” అంది కొడుకుతో . అతడు సమాధానం ఇచ్చే లోపులోనే “ఆయనతో కలిసి పార్కులో కేకులు తిన్నాను” .“ దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా!”


.
ఈ సంఘటన నుండి మనం ఏమి తెలుసుకోగలం ? ఒక ఆత్మీయ స్పర్శ , ఒక చిన్న చిరునవ్వు , ఒక చిన్న మాట , ఒక చిన్న ఆలకింపు , ఒక చిన్న మెచ్చుకోలు , ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకు రాగలదు .మనలో ఎవరమూ దేవుడిని చూడలేదు . ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు .జీవితం లో మనుషులు మనకు ఎదురుకావడం యాదృచ్చికం కాదు , దైవ సంకల్పం .... అది ఒక క్షణం కావచ్చు , కొంత కాలం కావచ్చు , జీవితాంతం కావచ్చు .ఎదురుపడిన వారిని సమానం గా గౌరవిద్దాం ! అందరిలోనూ దైవాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం ! ఇది సాధన ద్వారానే సాధ్యం ! ఇతరులు మనలో దైవాన్ని చూడగలిగేలా మంచి ప్రవర్తనతో ఉండాలి... నేటి మనిషికి కావాల్సినది నిజమైన ప్రేమ స్వచ్ఛమైన మంచి మనసు.. ఆత్మీయత.. చక్కని బంధాలను చక్కని ప్రేమానురాగాలతో కూడిన మనుషులు... వీటిని డబ్బు పెట్టి ఎవరు కొనుగోలు చేయలేరు.క్యారెక్టర్... ఇదే చాలా ముఖ్యం... ఈ క్యారెక్టర్ కొనలేము.. ఇది సహజంగానే మనిషి నుంచి స్వతహాగా ఆత్మీయతతో రావాలి అప్పుడు మానవాళి అందరూ కలిసి సుఖసంతోషాలతో ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: