హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.


ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.


ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.దీనినే కార్తీక నత్తాలు అంటారు. సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.సోమవారం అనునది ఖగోళ వస్తువు అయిన చంద్రునికి సంకేతం. దీని యొక్క జ్యోతిష రాశి "కర్కాటకం". దీనిని చంద్రుని యొక్క గుర్తుతో సూచిస్తారు.


 కార్తీక పూజలతో పరమాత్ముని తత్వం ప్రాముఖ్యం తెలుస్తుంది. కార్తీక మాసంలో ముఖ్యమైన వారం సోమవారం. ఈ రోజు శివునికి అత్యంత ప్రీతికరం. కార్తీక సోమవారాల్లో భగవత్ర్పీతిగా చేసిన స్నానం, దానాలు, జపాలు, అభిషేకాల వల్ల వేల కొలదీ అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలితం లభిస్తుందని పండితులు తెలుపుతుంటారు.  ఆవు నెయ్యితో కార్తీక దీపాన్ని వెలిగించడం మంచిది. విష్ణువు దరిద్రాలను దూరం చేసే దామోదరునిగా అవతరిస్తాడు. కార్తీక పూజలతో పరమాత్ముని తత్వం ప్రాముఖ్యం తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: