సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్ర మార్గమైన భావించే కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభమైంది. ప్రాజెక్టును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. మన్మోహన్‌ తొలి విడత భక్తులతో కలిసి సాధారణ వ్యక్తిగానే కర్తార్‌పూర్‌కు వెళ్తారని ఆయన  సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌తో  పాటు పలువురు వీఐపీలు తొలి విడత భక్తులతో కలిసి మందిరాన్ని దర్శించుకోనున్నారు. ఓ వైపు భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్నా.. రెండు దేశాలు కలిసి ఈ ప్రాజెక్టును నిర్మించాయి. 


సిక్కుల మత గురువు గురునానక్ పుణ్యక్షేత్రమైన గురుద్వారా దర్బార్ సాహిబ్‌ ను జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని ప్రతీ సిక్కు మతస్థుడు భావిస్తాడు. పాకిస్థాన్ పంజాబ్ నారోవాల్ జిల్లాలో దర్బార్ సాహిబ్ పుణ్యక్షేత్రం ఉంది. భారతీయ సిక్కులు దర్బార్ సాహిబ్ను సులభంగా సందర్శించుకోవడానికి కర్తార్పూర్ కారిడార్‌ ను నిర్మించారు. 


అయితే కర్తార్ నడవా మీదుగా గురుద్వారా దర్బార్ సాహిబ్ ను దర్శించుకునే భారత యాత్రికులకు పాస్ పోర్టు అవసరం లేదని, కేవలం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అంతేకాదు కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభమైన ఈ రోజున, యాత్రికులకు సర్వీసు ఫీజు కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సిక్కు యాత్రికులకు పాస్ పోర్టు అవసరమా లేదా అనే విషయంపై పాక్ స్పష్టత ఇవ్వాలని భారత్ అడిగింది. దీనిపై ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందిస్తూ.. భారత సిక్కు యాత్రికులకు పాస్ పోర్టు ఉండాల్సిందేనని తెలిపినట్టు పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. పాక్ భూభాగంలోకి వచ్చే ప్రతి ఒక్కరు న్యాయపరంగా రావాల్సిందేనని, భద్రతాపరమైన కారణాల రీత్యా పాస్ పోర్టు ఆధారంగానే ఎవరినైనా దేశంలోకి అనుమతిస్తామని పాక్ అంటోంది. పాకిస్తాన్ యూటర్న్ పై భారతీయ సిక్కులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాక్ లోని సరోవల్ జిల్లా గురుద్వారా దర్బార్ సాహిబ్ ను పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉన్న డేరా బాబా నానక్ తో ఈ దారి  అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతించనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: