నమస్కారం అనేది మనిషిలోని సంస్కారాన్ని తెలియచేస్తుంది. ఇంతకు నమస్కారం అంటే ఏంటంటే నమస్సు లేదా ” నమః ” అనగా “మనిషిలో గల ఆత్మ”ను గౌరవించుట అని అర్ధం. ఇక ఈ సంప్రదాయము భారత దేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన మరియు బౌద్ధమతావలంబీకులలో సాధారణంగా ఈ సాంప్రదాయం కనిపిస్తుంది..


ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించే అతి చక్కని ముద్ర గా నమస్కారము పరిగణింపబడుతుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియనే ఈ నమస్కారం.. ఇకపోతే ఏ గుడికైన వెళ్లి రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటాము. కాని ఇక్కడొక చిన్న విషయం వుంది. ఎప్పుడైన ఎక్కువ సార్లుగా దక్షిణం వైపు తిరిగి నమస్కారం పెట్టకూడదు అంటారు. వారు అన్నదాంట్లో చాలా లోతైన అర్దమే ఉండి ఉంటుంది.


ఎందుకంటే ఏ కారణం లేనిది మన పెద్దలు మనకు ఇలాంటి  నియమాలు పెట్టరు. ఇక అసలు దక్షిణం వైపు నమస్కారం ఎందుకు పెట్టకూడదో తెలుసుకుంటే ఎప్పుడూ కూడా దక్షిణమనేది యమధర్మరాజుగారి యొక్క దిక్కు దక్షిణానికి తిరిగి నమస్కారం చేస్తే యమధర్మరాజుగారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. ఇక మనిషికి యమధర్మరాజుగారి అనుగ్రహం కలిగితే ఏం జరుగుతుందో తెలిసిందే. ఇకపోతే ఎవరైన యమధర్మగారి యొక్క సదనాన్ని చేరుకోవాలన్నా శరీరము రోగ గ్రస్తము కావాలన్నా దక్షిణ దిక్కుకు తిరిగి ఎక్కువ నమస్కారం చెయ్యాలి,


రోగం వస్తే బాగుండూ అన్నారనుకోండి దక్షిణ దిక్కుకి ఎక్కువ నమస్కారం చెయ్యాలని పురాణాల్లో ఉంది.  అయితే ప్రాణం తీసే యమధర్మరాజుకు మరో శక్తి కూడా ఉంది. అదేమంటే ఆయన అనుగ్రహిస్తే రోగం లేకుండా కూడా చేస్తాడు. ఇకపోతే సాధారణంగా దక్షిణ దిక్కుకి తిరిగి చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం మాత్రం ఒక గృహస్తు కోరుకో కూడదు కనుక దక్షిణ దిక్కుకు నమస్కారం చెయ్యవద్దని చెప్తారు పెద్దలు, ఇక నమస్కారం చెయ్యడం ప్రధానం కాదు నమస్కారం చేసేటప్పుడు మీరు నమస్కారం ఎవరికి చేద్దామనుకున్నారో అన్నది ప్రధానం.


ఇకపోతే ఒక జగత్ గురువు దగ్గరైనా  సరే, భారతీతర్థస్వామే కాని, పరమాచార్య స్వామే కానియ్యండి ఇక్కడకొచ్చి ఇలా కూర్చున్నారనుకోండి మీరు దక్షిణానికి తిరిగి నమస్కారం చేశారనుకోండి ఆ నమస్కారం ఆయనకు వెళ్ళదు ఆ నమస్కారం యమధర్మరాజుగారికి వెళ్తుంది. మీరు అప్పుడు తూర్పు దిక్కుకు తిరిగో లేదా ఇంకో దిక్కుకు తిరిగో నమస్కారం చెయ్యాలి కానీ దక్షిణానికి తిరిగి మాత్రం చెయ్యకూడదు. గురువుగారు ఎదురుగుండా కూర్చున్నా గురువుగారికి కూడా అలా చేయకూడదు. అందుకే పూర్వకాలంలో ముందు వెళ్తూనే దిక్కేది అని అడిగి తెలుసుకొని నమస్కారం చేసేవారు. ఇదండీ దక్షిణానికి నమస్కారం ఎందుకు పెట్టకూడదనే దానిలోని అర్ధం..



మరింత సమాచారం తెలుసుకోండి: