అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. అయోధ్యను బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. అయోధ్య రూపురేఖలు మార్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రచిస్తోంది. తిరుమల తరహాలో ఆధ్యాత్మిక నగరిగా ఆయోధ్యను అభివృద్ధి చేయాలని సంకల్పించింది.


ఇదే సమయంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం..ఓ ముస్లిం ముందుకొచ్చాడు. 51వేలు రూపాయలు విరాళమిస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. ఆయన ఎవరో కాదు.. యూపీ  షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్  వసీమ్ రిజ్వి. ఆయన రామ మందిర నిర్మాణానికితమ బోర్డు అనుకూలమేనని రిజ్వీ తెలిపారు.


ఏళ్ల తరబడిగా సాగిన వివాదానికి సుప్రీంకోర్టు తెరదించిందన్న రిజ్వీ వీలైనంత మేరకు చక్కని తీర్పునిచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయన్న రిజ్వీ.. వసీమ్ రిజ్వి ఫిల్మ్స్ తరుఫున మందిర నిర్మాణం కోసం రామజన్మభూమి న్యాస్ కు 51 వేలు విరాళమిస్తున్నట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: