శబరిమల ఆలయం భక్తుల దర్శనానికి నేడు తెరుచుకోనుంది. పరమ పవిత్రంగా భావించే ఈ ఆలయంలోకి మహిళా భక్తుల రాకను అయ్యప్ప భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోయిన సంవత్సరం ఇది పెద్ద వివాదంగా మారి ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. దీంతో కేరళ ప్రభుత్వం ఈసారి అప్రమత్తమై శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పించలేమని కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. 


శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్‌ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్‌ నంబూద్రి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. 


ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్నీ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్‌ తెలిపారు. ఇంకా కేరళ సీఎం కూడా కోర్టు తీర్పుపై అయోమయం నెలకొందని చెప్పారు. మరోవైపు మహిళ ఉద్యమకారులు శబరిమలను ఖచ్చితంగా దర్శించుకొని తీరుతామని స్పష్టం చేస్తున్నారు. మరి ఎం అవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: