శబరిమల ఆలయం రెండు నెలల తర్వాత తెరుచుకుంది. సన్నిధానం దగ్గర భక్తుల రద్దీ పెరగడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్వామి దర్శనం కోసం వచ్చిన 10 మంది తెలుగు మహిళలను పోలీసులు తిప్పి పంపించడంతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50ఏళ్ల లోపు మహిళలను పంపడం కుదరని పోలీసులు తేల్చి చెప్పడంతో వెనక్కి తిరిగారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా దాదాపు 10వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. 


కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ప్రధాన పూజారి కండారు మహేశ్‌ మోహనారు, ముఖ్య పూజారి ఏకే సుధీర్‌ నంబూద్రి ఆలయంలో శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడిని తెరిచారు. ఈరోజు నుంచి డిసెంబర్‌ 27 వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. స్వామి దర్శనార్థం శబరిమలకు వెళ్లిన నిషేధిత వయస్సున్న విజయవాడ మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. అయ్యప్ప దర్శనానికి వచ్చిన 10 మంది తెలుగు మహిళల వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించి వారిని వెనక్కి పంపారు. దీంతో పోలీసులకు, మహిళలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 ఏళ్ల లోపు వయస్సున్న మహిళలను ముందుకు పంపడం కుదరడంలేదని పోలీసులు స్పష్టంచేశారు. ఇక చేసేదేమీ లేక వారంతా తిరుగుముఖం పట్టారు.  


ఆలయ పరిసరాల చుట్టూ 10వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కేరళ ప్రభుత్వం రక్షణ కల్పించినా.. కల్పించకపోయినా.. నవంబర్‌ 20 తర్వాత శబరిమలకు వెళ్లి తీరతానన్నారు మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌. కేరళ ప్రభుత్వం నుంచి రక్షణ కోరతానని, అయితే భద్రత కల్పించాలా.. వద్దా అనే అంశాన్ని ఆ ప్రభుత్వానికే వదిలేస్తున్నానన్నారు తృప్తి దేశాయ్. నియమ నిష్ఠలతో దీక్షలు చేపట్టిన అయ్యప్ప భక్తులు.. స్వామి ప్రారంభ దర్శనానికి పోటెత్తారు. డిసెంబర్ 27వరకు స్వామికి నిత్యపూజలు జరుగుతాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: