భూమి పై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక కర్మ అనుభవించక తప్పదు. ఆ కర్మానుసారమే తన జీవితం ముందుకు నడుస్తుంది అన్నది సత్యమని మన పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే మనిషి అనే ప్రాణి పుడమి పై కన్ను తెరచింది మొదలు, కన్ను మూసే వరకు గుప్పెడు కష్టాలు, గుండెనిండా సంతోషాలు, అప్పుడప్పుడు వచ్చే కన్నీళ్లు ఇదే మనిషి జీవితంగా బ్రతుకుతున్నాడు.

 

ఇక మానవునిగా జన్మ ఎత్తింది మొదలు వారి జీవితంలో బాల్యదశ, యవ్వన దశ, ప్రౌఢదశ, వృద్ధాప్యము  ఇవన్ని అనుభవించవలసిందే. ప్రతి దశలోను వచ్చే జీవితానుభవము చాలా గొప్పది. ఇకపోతే మనిషి యవ్వనానికి వచ్చాక మనసు తోడు కోరుకుంటుంది. అప్పుడు పెళ్లి పేరుతో రెండు ప్రాణులకు కలిపి ఒకే జీవితం ఏర్పాటు చేస్తారు. దాన్నే సంసారం అంటారు.

 

ఇక ఈ విధానాన్ని పూర్తిగా భగవంతుడు చెప్పిన దానికి అన్వయించుకుంటే సంసారం అనే పదంలో ఎంతో అర్ధం ఉంది.  ఆదిశంకరులు చమత్కార పూర్వకముగా ఒక మాట చెప్పకనే చెప్పారు. పరమాత్మ మరియు ప్రకృతిల కలయికే ఈ మాయాసంసారమునకు హేతువు అని.. అదెలాగంటే ఊర్ధ్వదిశకు వెళ్ళు శుక్రము ఓజస్సు భ్రాజస్సు స్థితులను దాటును.  అప్పుడు కుండలినీ సహస్రార చక్రమునకు చేరును. ఇక త్రేతాగ్నులలోని శుక్రము దక్షిణాగ్ని అందురు.

 

ఈ శుక్రము అంటే ఇంద్రియ పరితృప్తికి లేదా కామ పరితృప్తికి ఉపయోగించునది ఇకపోతే మనావుడు సంతానోత్పత్తికి ఉపయోగించు శుక్రమును గార్హపత్యాగ్ని అందురు.. ఇందులో ఆధ్యాత్మిక ఉన్నతికి గానీ, కుండలినీ సిద్ధికి ఉపయోగించు శుక్రమును ఆహవనీయాగ్ని శుక్రమును అంటారు. ఇందులో దక్షిణాగ్ని మరియు గార్హపత్యాగ్ని రెండూను అథోమార్గము,  ఆహవనీయాగ్నిఊర్ధ్వదిశా మార్గము లేదా సుషుమ్నా మార్గము అందురు.

 

ఇకపోతే దక్షిణాగ్ని శుక్రముది అథో అనగా పాతాళలోక మార్గము. గార్హపత్యాగ్ని శుక్రముది అథో అనగా మర్త్యలోక మార్గము. ఇక కుండలినీ సిద్ధికి ఉపయోగించు శుక్రమును అనగా ఆహవనీయాగ్నిది ఊర్ధ్వదిశా మార్గము లేదా దేవలోక మార్గము అంటారు. ఇక ఇంద్రియ నిగ్రహ శక్తి పడిపోవడాన్ని గోత్ర స్ఖలనము అంటారు.

 

దీనర్దం వివరంగా తెలుసుకుంటే  గో అనగా ఇంద్రియము,  త్ర అనగా రక్షణ, స్ఖలనము అనగా  సడలిపోవుట అనే అర్దం వస్తుంది.. ఇక మనిషిలో ఉన్న శుక్రమునే ‘గంగా’ అందురు. ఈ శుక్రము సహస్రార చక్రమును చేరుటే అర్థనారీశ్వర తత్వము అందురు. శివుడ్ని కాలితో తన్నుట అనే అర్ధాన్ని   పరకృతి శుద్ధమనస్సును లొంగ తీసుకొనుటగా భావిస్తారు అదే సంసారము. నేటి మనుషులు తమలోని ఇంద్రియాలను నిగ్రహించుకోక, విచ్చలవిడిగా లోకంలో ప్రవర్తిస్తున్నారు. తమ విలువ తెలుసుకోక దిగజారి పోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: