ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. సీబీఐ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల గురించి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. సీబీఐని ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ చాలా సార్లు కోరారు. సీఎం జగన్ బెయిల్ పిటిషన్ లో తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావటం వలన 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. 
 
కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని గతంలో కోర్టు సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపుకు అనుమతి ఇవ్వలేదు. హైదరాబాద్ లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసు విచారణలో భాగంగా సీఎం జగన్ కోర్టుకు హాజరు కానవసరం లేదని తెలిపింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్నారు. 
 
16 నెలలపాటు జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు విషయంలో హైదరాబాద్ లోని చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆ తరువాత జగన్ బెయిల్ పై విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ప్రతి శుక్రవారం సీఎం జగన్ కోర్టుకు హాజరవుతున్నారు. సీబీఐ కోర్టు సీఎం జగన్ హాజరు కానవసరం లేదని పేర్కొనటంతో సీఎం జగన్ కు ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం సీబీఐ కోర్టు జగన్ పిటిషన్ ను తిరస్కరించింది. 
 
హోదాను కారణంగా చూపి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరరాదని సీబీఐ కోర్టు కొన్ని రోజుల క్రితం జరిపిన విచారణలో స్పష్టం చేసింది. సీబీఐ కోర్టు తీర్పుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ పై విమర్శలు చేశారు. ఎల్లో మీడియా జగన్ వ్యక్తిగత మినహాయింపుకు కోర్టు అంగీకరించకపోవటంతో ఎన్నో కథనాలను వండివార్చింది. సీబీఐ కోర్టు జగన్ కోర్టుకు హాజరు కానవసరం లేదని తెలపడం చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు షాక్ అనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: