ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రోజు సోమవారం,25.11.2019 ఉదయం 5 గంటల
   సమయానికి తిరుమల: 17C°-25℃°

 

• నిన్న 91,551 మంది శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02 గదిలో భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 05 గంటలు పట్టవచ్చును.

• నిన్న 31,573 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు
  ₹: 3.42 కోట్లు.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

శ్రీ పద్మావతి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాలు

 

నవంబర్ 23 నుండి డిసెంబరు 1 వరకు వైభవంగా జరుగును, ఈ రొజు అమ్మవారి బ్రహ్మోత్సవా ల్లో వాహన సేవలు:

# కల్పవృక్ష వాహనం (ఉ: 8 - 10వరకు)

# సింహవాహనం (రా: 7.30 - 11వరకు)

 

గమనిక:

#  ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

# ఈనెల 26న వృద్ధులు /దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం, (భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు).

 

# ఈనెల 27 న 5సం లోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

 

వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.

 

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: