భూగర్భంలో కలిసిపోయిన ప్రాచీనకాలం నాటి శివలింగం ఎట్టకేలకు బయట ప్రపంచానికి దర్శనమిచ్చింది. విజయనగరం జిల్లా గంట్యాడ, దివాంజీ కోనేరులోని శిథిల బావిలో భూమికి చాలా దిగువన శివలింగం ఉండేదని పూర్వీకులు ఆ గ్రామస్తులకు తెలిపే వారు అట. 

 

మంచినీటి కోసం బావి తవ్వకం జరిపిన సమయంలో ఆ శివలింగం భూమిలో మరింత లోతుగా వెళ్లిపోయింది. తాజాగా దివాంజీ కోనేరు పరిసర ప్రదేశాలను పార్కుగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు బాగా  జరుగుతున్నాయి. దివాంజీ కోనేరులో ఉన్న మంచినీటి బావి కూడా చాలా శిధిలమైపోయి గోడలు చాలా వరకు నేలమట్టం అయ్యాయి. 

 

దివాంజీ కోనేరు పరిసర ప్రదేశాలను ప్రస్తుతం పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రం చేయించడం జరిగింది.  శిధిలమైన మంచినీటి బావిలో ప్రాచీన శివలింగం కోసం గాలింపు చర్యలు మొదలు కూడా పెట్టారు. కోనేరు పరిసర ప్రదేశాల్లో ప్రస్తుతం పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రం చేశారు.  శిధిలమైన మంచినీటి బావిలో ప్రాచీన శివలింగం కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. బావిలోని నీటిని బయటకు తేవడానికి ఇంజన్లను ఏర్పాటు చేయడం జరిగింది.

 

సుమారు మూడు రోజులకు పైగా నీటిని తోడేసి శివలింగం కోసం అన్వేషించారు. శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఒక రాతిపై శివలింగం సాక్షాత్కరించింది. రాయి నుంచి శివలింగాన్ని వేరు చేసి బయటికి తీయడానికి ఎంతగా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. బండరాయిని అతుక్కుపోయిన విధంగా శివలింగం ఉండడంతో అక్కడి ప్రజలు ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. 

 

బయటపడిన శివలింగాన్ని స్థానికులు ఫోటోలు తీసుకోవడానికి పోటీపడ్డారు. ఈ వార్త తెలుసుకున్న స్థానికులు గుంపులు గుంపులుగా దివాంజీ కోనేరు వద్దకు చేరుకుని శివలింగాన్ని వీక్షించారు. నిమిషాల వ్యవధిలోనే మళ్లీ బావిలోని నీరు ఉట భారీగా చేరడంతో శివలింగం కాస్త మళ్లీ బావిలో నీటిలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: