అయ్యప్ప మాల ధరించు స్వాములు ఏ రోజు మంచిదని ఇంకా ఆలోచిస్తున్నారు, అలాంటి  స్వాములందరికి ఒక సూచన.

 

 1. మాల ధరించుటకు ముహుర్తాలు, వారాలు, తిథి చూడనవసరం లేదు. మీ ఇంట్లో పీటం పెట్టుకోవాలి అనుకొంటే, ఇంట్లో వాళ్ళకు ఏ ప్రాబ్లం లేని సమయం చూసుకొంటే చాలు. ప్రతిరోజు ప్రత్యేకమే అని గమనించాలి.

 

2. మండల కాలం పాటు మాల ధారణ వ్రత దీక్ష పూనుటమనేది జీవితమంతా కాదు, ఇదొక ఆధ్యాత్మిక శాశ్విత బంధం.

 

3. ఈ మధ్య కాలంలో నిబంధనలు కొన్ని తెలిసి మరిన్నీ తెలియక పెంచుతూ పోతున్నారు. అనగా కొత్త కొత్తగా పెంచటం కొందరికి అలవాటై పోయింది. అయ్యప్ప వ్రత దీక్ష నియమాలు కేరళలో ఒకసారి నిర్ణయించబడినది. అసలు మనము ఎవరమండి, పెంచటానికి? కొందరికి ఏం పర్వలేదు అని చెప్పటానికి. గురుస్వాములు ఏమైన చెయ్యోచ్చు అంటున్నారు ఈమధ్య, అందరు గమనించాలి వారికి అంటూ ప్రత్యేక సడలింపులు ఏమి లేవు, వారే మర్గదర్శికులు, వారిని చూసి మిగిత వారు అనుసరిస్తారు కాబట్టి గురుస్వాములు మరింత నియమ నిష్టలతో ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.

 

4. పాటించవలసిన నియమాలు సరిగ్గా నియమ బద్దంగా, మనసాక్షికి విరుద్దముగా కాకుండా, భక్తితో మీ హృదయాన్ని ఆ అయ్యప్ప స్వామికు అర్పించడానికి మాత్రం కృషి చేయండి చాలు. అనవసర చాదస్తాల జోలికి పోకండి.

 

5. హిందు ధర్మంలో అనేక పూజ, వ్రత, హోమ, అభిషేకాదులకు వేరు వేరు నియమాలు ఉన్నాయి. అన్నింటిని కలిపి కుప్ప పోసి, ఎవరికి ఏది కనిపిస్తే లేదా ఎవరినైనా చూస్తే, వింటే, చదివేసో ఎవరో గురువు ముసుగులో స్వార్థ పరుల మాటలను విని  దయచేసి అయ్యప్ప వ్రత దీక్షకు అవన్నీ కలిపి నిర్మల హృదయాలను కలుషితం చేయకండి. అలాంటివి మీరు చూసి అనుమానాలకు ఆందోళనలకు గురికాకండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: