అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం తిరుమల. ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ది చెందిన పుణ్యస్థలం. అత్యంత ప్రతిష్టాత్మక ఆలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై వుందని బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య అన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడినప్పుడే  ఎంతోమంది  భక్తుల మనోభావాలను కూడా కాపాడినట్లు అవుతుందన్నారు. ఇది ప్రభుత్వం పై ఆధారపడి ఉంటుదని తెలిపారు.

తిరుమల పవిత్రతను ఆగమ శాస్త్రవిలువలను మంటగలిపే విధంగా ముఖ్య మంత్రి జగన్ మోహన్ 
తీరు ఉందని ఆరోపించారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి తండ్రి తిరుమల ఏడు కొండులు కాదు రెండు కొంలేనని జీవో తెచ్చినట్లు ఇప్పుడు జగన్ కూడా అలాగె వ్యవహరిస్తున్నారని అన్నారు.

 

తిరుమల బస్‌టికెట్లపై అన్యమత ప్రచారం మొదలు టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసుక్రీస్తు బోధనల పుస్తకాలు అప్‌లోడ్‌ చేయడం, టీటీడీలో అన్యమతస్తులు విధులు నిర్వర్తించడం, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధులతగ్గింపు,  పవిత్ర తిరుమల దేవాలయంపై మంత్రుల పరుష పదజాలంతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు.

 


టీటీడీ వెబ్ సైట్ లోని పంచాంగ సమాచారంలో 'శ్రీ యేసయ్య' అనే అక్షరాలు హిందువులను ఎంతగానో కలచివేశాయని  అన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో అన్య మత ప్రాచారం భక్తులకు తీవ్ర మనస్థాపనికి గురి చేస్తున్నాయని అన్నారు.  

 

పదేపదే తెలుగుదేశం పార్టీపై లేని ఆరోపణలను గుప్పించే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, వైసీపీ నాయకులు మల్లాది విష్ణు దీనికి ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు.  తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను మంటగలిపిన వారందరూ దేవుని శిక్షకు గురయ్యారని గుర్తుచేశారు.  

 

ఇప్పటికైనా సిఎం జగన్ తన వ్యవహారాన్ని మార్చుకోవాలని.. లేదంటే స్వామి భక్తులు ఒక్కటై పోరాటానికి దిగాల్సి ఉంటుందని అన్నారు . స్వామి వారితో పెట్టుకుంటే మీ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోతుందని ఆనందసూర్యహెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: