హజ్ యాత్రికుల కోసం హజ్  ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదివారం జెద్దా లో  సౌదీ హజ్ మంత్రితో కలిసి  వచ్చే ఏడాది హజ్  యాత్రకు సంబందించిన  ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసిన తరువాత చెప్పారు.

 

మక్కా మరియు మదీనాలో వసతి మరియు రవాణాకు సంబంధించి భారతదేశంలోనే మొత్తం సమాచారాన్ని అందించే ఆన్‌లైన్ అప్లికేషన్, ఇ-వీసా, హజ్ మొబైల్ అప్, ఆరోగ్య సౌకర్యం, “ఇ-లగేజ్ ప్రీ-ట్యాగింగ్” 2020 లో హజ్ కోసం వెళ్లే 2 లక్షల మంది భారతీయ ముస్లింలకు అందించబడుతుంది అని నఖ్వీ చెప్పారు.

 

భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక వార్షిక హజ్ 2020 ఒప్పందం పై కేంద్ర మైనారిటీ వ్యవహారాల  శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ  మరియు సౌదీ అరేబియా హజ్ మరియు  ఉమ్రా శాఖ మంత్రి మొహమ్మద్ సలేహ్ బిన్ తాహెర్ బెంటెన్‌తో కలిసి  సంతకం చేసారు.

 

సౌదీ  అరేబియాలోని  విమానాశ్రయానికి  చేరుకున్న తరువాత భారత యాత్రికులకు తమకు కేటాయించిన వసతుల గురించి మరియు  రవాణా వివరాల గురించి భారతదేశంలోనే సమాచారం లభిస్తుందని మరియు నిర్ధారిస్తుందని మంత్రి తన కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం   ఈ ప్రక్రియకు సంబంధించిన సమాచారం అందించడానికి  100 లైన్ల సమాచార కేంద్రాన్ని ముంబైలోని హజ్ హౌస్ వద్ద ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.

 

 

భారతీయ హజ్ యాత్రికులకు హెల్త్ కార్డ్ అందిస్తున్నట్లు నఖ్వీ తెలిపారు. ఇ-మాసిహా (విదేశాలలో ఉన్న భారతీయ యాత్రికుల కోసం ఇ-మెడికల్ అసిస్టెన్స్ సిస్టమ్), వైద్యుల ప్రిస్క్రిప్షన్లు, వైద్య చికిత్సతో పాటు మందుల  పంపిణీతో పాటు భారతీయ యాత్రికుల పూర్తి ఆరోగ్య డేటాబేస్ను రూపొందించడానికి మరియు నిర్వహించడానికి ఆన్‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. మక్కా మరియు మదీనాలో అత్యవసర పరిస్థితి లో ఉపయోగించడానికి మెడికల్ ఎమర్జెన్సీ సదుపాయం  ఉందని ఆయన అన్నారు. ఈ సదుపాయం రావడంతో హజ్ యాత్ర అప్లికేషన్ ప్రాసెస్ సులభ తరం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: