అల్లు అర్జున్ మంచి లుక్ తో పాటుగా మంచి నటన మరియు అద్బుత డ్యాన్స్ నైపుణ్యాలు కలిగిన టాలీవుడ్ సెన్సేషన్. బన్నీ స్టైలిష్ డాన్స్ లేకుండా బన్నీ యొక్క ఏ చిత్రం పూర్తి కాదు. అందుకే అల్లు అర్జున్ ను టాలీవుడ్ అభిమానులు స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇటీవల నటి అవికా గోర్ అల్లు అర్జున్ డ్యాన్స్ స్టైల్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఉయల జంపాలా సినిమాతో టాలీవుడుకు పరిచయమైన యువ నటి అవికా గోర్ అల్లు అర్జున్ డాన్సుకు ఫ్యాన్ అట. 

 

ఇటీవల అవికా గోర్ ఒక ఇంటర్వ్యూలో, అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ చేస్తారా అని అడిగినప్పుడు అవికా ఫన్నీ కామెంట్ చేశారు. “నేను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో డాన్స్ చెయ్యాలా? పిచ్ఛా మీకు? నా కాళ్ళు విరగాలని కోరుకుంటున్నారా మీరు?, అల్లు అర్జున్ తో కలిసి డాన్స్ చేయడం చాలా కష్టం.” అని అవికా గోర్ చెప్పింది. అవికా గోర్ ఇంకా మాట్లాడుతూ, నా డాన్స్ చూస్తే నాతో కలిసి అల్లు అర్జున్ డాన్స్ చేయడు, నేను గొప్ప డాన్సర్ ని కాదు. ఎప్పుడైనా అవకాశం లభిస్తే అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ చేయడం నిజంగా ఇష్టమని ఆమె చెప్పింది.

 

అవికా గోర్ ఒక టీవీ నటి, బాలిక వధూ అనే హిందీ సీరియల్ లో ఆనందీ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు మరియు సాసురల్ సిమార్ కా లో రోలీ పాత్రలో నటించారు. 2013 లో ఉయల జంపాలాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, ఈ సినిమాలో రాజ్ తరుణ్‌తో నటించారు మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఈ సంవత్సరం ఆమె హర్రర్ కామెడీ డ్రామా అయిన రాజు గారి గాది 3 లో కనిపించింది. మరోవైపు, అల్లు అర్జున్ ప్రస్తుతం పూజా హెగ్డేతో కలిసి రాబోయే యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల వైకుంఠపురంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: