తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి పేరు పొందిన పుణ్యక్షేత్రము. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిది ఉగ్రరూపం అని అందరూ అనుకుంటారు. కానీ స్వామిది ఉగ్ర రూపము కాదని చెప్పారు .ఆయన శాంత మూర్తేనని ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు స్పష్టంగా విశదీకరించి చెప్పారు. సింహానికి కోరలుండడం సహజమైన విషయమేనని తెలిపారు. సింహానికి కోరలు ఉండడము అంతమాత్రాన స్వామివారు ఉగ్ర రూపంలో ఉన్నట్లు కాదని స్పష్టీకరణ చేశారు. మూల విరాట్టుకు ఉగ్రరూపం వచ్చేలా మూల విరాట్టుకు మార్పులు చేశారని ఆరోపించడం జరిగింది. 

 

ఇలా వస్తున్న వాదనల నేపథ్యంలో ఆలయ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ వాదనలు పూర్తి అబద్ధమని తెలియ జేశారు. ఆగమ శాస్త్ర పరంగా ఎలాంటి తప్పూ జరగలేదని వివరణ ఇవ్వడం జరిగింది. మన లక్ష్మీ నరసింహ స్వామివారు.. గొప్ప శక్తిమంతుడు ఎన్నో మహిమలు గలవాడు. ఎన్నో యుగాల క్రితమే యాదాద్రిలో ఆవిర్భవించడం జరిగింది. కాలం గడుస్తున్న కొద్దీ మార్పులనేవి సహజమైనటువంటి విషయం. మనము కూడా ఒక్కోసారి కాలాను సారము మారవలసి వస్తున్నది. మనుషుల విషయంలోనూ మనం బాల్యములో ఎలా ఉన్నామో.. పెరిగి పెద్దయ్యాక అలాగే ఉన్నామా? అని అడిగారు.

 

  కుంభాభిషేకం జరిగే ఈ సందర్భంలో లక్ష్మి నరసింహ స్వామి మూల విరాట్టుపై ఈ రకమైన వార్తలు రావడం విచారించదగ్గ విషయం. భక్తుల మనోభావాలను దెబ్బతీసినటు అవుతుంది. ఈ వార్తను అక్కడి ప్రధాన అర్చకులు పూర్తిగా ఖండిస్తున్నాం అని చెప్పారు. యాదాద్రి ఒక్కటే కాదు. ప్రపంచంలో ఏ నరసింహ స్వామి విగ్రహాన్ని చూసినా, నాలుక బయటికే చాచినట్లు ఉంటుంది. ఈ కాలపు ఆర్ట్‌ క్యాలెండర్లు చూడకండి. ఆర్ట్ అనేది మన చేతిలో పని. వాటిని ఏవిధంగానైనా రూపొందించవచ్చు.  బొమ్మలు ఎలాగైనా గీసుకోవచ్చు. కావాలంటే వంద తలలు డిజైన్ కూడా  చేసుకోవచ్చు.

 

శిల్ప శాస్త్ర ప్రకారం నాలుక బయటకు ఉండడం నరసింహస్వామి రూపధర్మంలో ప్రధాన ఘట్టము. మూలవిరాట్టును శిల్పులెవరూ తాకక పోవడము కూడా చెప్పదగిన విశేషము. కొన్ని దశాబ్దాలుగా విగ్రహానికి సింధూరం అద్దుతుండడం వల్ల దాదాపు 15 అంగుళాల మేర పేరుక పోయింది. స్వామివారికి ఎప్పటినుంచో వేస్తున్న ఈ సింధూరాన్ని మేం స్వయంగా తొలగించడం జరిగినది. ఆలయ విస్తరణ పరిచే నిర్మాణాల్లో భాగంగా ఒకసారి నేను అసంతృప్తికి గురైన సంగతి నిజమే.. అని తెలియ చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం కేసీఆర్‌ బొమ్మలను గోడలపై చెక్కారు.ఇలా ఒక ముఖ్యమంత్రి  యొక్క చిత్రాలను ఆలయ గోడలపై నిర్మించడము బాధాకరమైన విషయము. దాంతో మేం బాగా ఫీలయ్యాం.’’ అని ఆలయ ప్రధాన అధికారి లక్ష్మీనరసింహాచార్యులు వివరణ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: