మనం నిత్యం వింటూ ఉంటాం శక్తీవంతమైన దేవతల గురించి.. దేవుళ్ళ గురించి. ఒకొక్కసారి చెప్తూ ఉంటాం కూడా సునామి ఆ ఆలయంను తాకలేకపోయింది అంట అని.. అయితే ఇది చదివాకా అనిపిస్తుంది ఆ మాటలు నిజమే అని.. 2004లో ఇండోనేషియా తీరంలో ఏర్పడిన సునామీ అనేక దేశాల తీరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. 

 

అయితే మన భారత తూర్పు, పశ్చిమ తీరప్రాంతాల్లోని పలు ప్రదేశాల్లో విలయం సృష్టించింది. దీని ధాటికి కేరళ దక్షిణ తీరం తీవ్ర నష్టానికి గురైంది. అయితే కొల్లాం జిల్లాలో అరేబియా సముద్రానికి, జలమార్గానికి మధ్య ఉన్న చిన్న దీవిలోని అమ్మవారి ఆలయాన్ని మాత్రం సునామీ తాకలేక పోయింది.  

 

అమ్మవారి మహిమ కారణంగానే సునామీ అలలు ఇక్కడకు రాలేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేరళలోని కొల్లాం జిల్లా శంకర మంగళం సమీపంలో కట్టిల్‌ మెక్కతిల్‌ భాగవతి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి అనేక శతబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

స్థలపురాణం ప్రకారం ఇక్కడ వెలసిన అమ్మవారు చంపక్కులం నుంచి మొసలిపై వచ్చి స్వయంభువుగా వెలిశారు. అమ్మవారే ఈ ఆలయంలో స్వయంగా దీపం వెలిగించారని చెబుతుంటారు కొందరు. అయితే ఆ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలకు చంపక్కులం నుంచి ధ్వజం రావడం సంప్రదాయంగా మారింది. 

 

కేరళ పాలకుల్లో అగ్రవీరుల్లో ఒకరైన రాజా మార్తాండవర్మ ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని ఆరాధించారు. అక్కడే ఒక భవంతిని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆలయంలో మరో విశేషం ఉంది. అదేంటంటే అమ్మవారిని మొక్కుకున్న మొక్కులు తీర్చటం. 

 

Related image

 

అమ్మవారికి మొక్కుకున్న భక్తులు తమ కోరికలు తీరిన అనంతరం ఆ అమ్మవారికి ఇత్తడి గంటలను ఇస్తారు. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కొమ్మలకు ఈ గంటలు కడతారు. అయితే ఒక్క నెలకు దాదాపు 4 లక్షల గంటలు కడతారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. మర్రిచెట్టులోని దాదాపు సగం కొమ్మలకు ఈ గంటలు ఉంటాయి. 

 

కొందరు ఒక గంట కడితే మరికొందరు వెయ్యి గంటల వరకు కడుతుంటారు. ఆ గంటలు కట్టడం కూడా భక్తులు వారి ఆరాధన బట్టి కోరికలు బట్టి గంటలు కడుతారు అని అర్చకులు చెప్తున్నారు. అయితే ఈ గర్భగుడిలో అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి గంటలు కట్టి తమ మొక్కు తీర్చుకుంటారు. 

 

Related image

 

ఈ గంటలు కట్టే సంప్రదాయంకు ఒక చరిత్ర ఉంది. అదేంటంటే.. ఓ సారి ఆలయ ధ్వజస్తంభం నుంచి ఓ గంట కిందకు పడిపోయింది. దీంతో అర్చుకుల్లో ఒకరు ఆ గంటను తీసుకొని మర్రిచెట్టు కొమ్మకు కట్టారు. అనంతరం ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆలా జరగటంతో ఈ ఆలయంలో గంటలు కట్టే సంప్రదాయం అప్పటి నుండి ప్రారంభమైంది.

 

అయితే ఈ ఆలయానికి చేరుకోవాలి అనుకునే వారు రైల్లో కొల్లాం చేరుకుని అక్కడ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. ఇంకా విమానంలో అయితే కొల్లాం సమీపంలో ఉన్న తిరువనంతపురంలో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుండి మళ్ళి ఆలయానికి సముద్రంపై వెళ్లాల్సి ఉంటుంది. చూశారు కదండీ ఈ ఆలయం విశిష్టత.. ఈ ఆలయానికి వెళ్లి అమ్మవారిని ఆరాధించి తీరని కోరిక ఉంటె కోరుకోండి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: