ప్లాస్టిక్ వాడకం రోజురోజుకీ మితిమీరి పోతుంది. దీంతో వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం , ప్రకృతి అంతరించి పోవడం తో   పాటు వాయు కాలుష్యం కూడా ఎక్కువ అయిపోతుంది. దీనివల్ల మానవ మనుగడకి ఆటకం కలుగుతుంది.

ఒక ప్లాస్టిక్ వస్తువు పూర్తిగా మట్టిలో కలిసి పోవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల వర్షపు నీరు భూగర్భంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కలవకపోవడం వలన పశువులు ఒక్కోసారి ప్లాస్టిక్ ని తినటం కూడా జరుగుతుంది.


ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే అందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ప్లాస్టిక్ ని అరికట్టే అందుకు ఒక వినూత్న ఆలోచన చేసింది. "మీ దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఇవ్వండి మా దగ్గర నుండి బియ్యం తీసుకుని వెళ్ళండి "అని కొత్త ఆలోచన కి శ్రీకారం చుట్టింది.


దీనికోసం ప్రత్యేకంగా రెండు వాహనాలను కూడా పెట్టింది. ఈ వాహనాలు ఇళ్ల దగ్గరకే వచ్చి ప్లాస్టిక్ ని తీసుకుని వెళ్తాయి. కేజీ ప్లాస్టిక్ ఇస్తే కేజీ బియ్యం రిటర్న్ ఇస్తారు.

స్వచ్ఛ- సర్వేక్షన్ 2020 పై ప్రజల్లో అవగాహన తీసుకునివచ్చి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే లక్ష్యం గా ఇలాంటి ప్రయత్నం చేశారు. ప్లాస్టిక్ ని సేకరించడానికి పెట్టిన రెండు వాహనాల్ని నగర కమిషనర్ అభిషిఖ్త్ కిషోర్ గురువారం నాడు ప్రారంభించారు. ప్లాస్టిక్ ను రోడ్లపైన , డ్రైనేజీ లోను, నదులలోను పారవేయొద్దని నగరాన్ని పరిశభ్రంగా ఉంచుదామని అయన ప్రజలకి విజ్ఞప్తి చేసారు. ఇలా అయినా ప్లాస్టిక్ వాడకం తగ్గాలి. ప్రజల్లో అవగాహన రావాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: