ప్రతిఒక్కరూ.. తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనుగడ సాగించడానికి చాలా ముఖ్యమైనది. ఆహారంతోపాటు, డబ్బు కూడా చాలా అవసరమైనది. అయితే కష్టపడి పనిచేసినప్పుడు కావాల్సినంత డబ్బు పొందగలుగుతాం.


ఎంత సంపాదించినా మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకపోతే,వాస్తు సరిగా లేకున్నా డబ్బులు ఖర్చు అయిపోతాయి. కొన్ని నియమాలు పాటించడం, వాస్తు సరిగా ఉండడం, కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల, మీ డబ్బు మీ ఇంట్లోనే ఉంటుంది. డబ్బు లేదు అన్న సమస్య మీ దగ్గరకు రాదు.


ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీమీద ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ని ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మీ ఇంటి ప్రధాన ముఖం ద్వారంలో లక్ష్మి, కుబేరులు, లేదా స్వస్తిక్ ఫోటోలను అతికించాలి. ఇలా పెట్టడం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుంది. వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నగేటివ్ ఎనర్జీ పోయి, అందరు సుఖ శాంతి తో ఉంటారు.

 

మట్టితో చేసిన నీటి కూజా ని ఇంట్లో ఉత్తర దిక్కున ఉంచాలి. అది కూడా మట్టితో చేసినదై ఉండాలి. మెటల్ ఫిష్ లేదా తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం గా ఉంటారు.
మీకు ఒకవేళ షాప్ లేదా వ్యాపారం ఉంటే మనీ లాకర్ ఉత్తరం వైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం అద్భుతం గా ఉంటుంది. ఇంట్లోగాని, షాప్ లోగాని లైటింగ్ బాగా ఉండేలా చూసుకోవాలి.

చీపురులు, ఇల్లు తుడిచే మాఫ్ లు, చెప్పులు, షూస్ వంటి వాటిని ఎట్టి పరిస్థితులలో మెట్ల కింద పెట్టకూడదు. దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు. వాస్తుఅనేది చాలా  పవర్ ఫుల్. వాస్తు చాలా శక్తివంతమైనది.

ఎందుకంటే.. సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని, చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని, ఎర్త్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ ఎనర్జీని, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను. . గ్రహించే శక్తి వాస్తు కి ఉంది. ఇంటి ముందు ముగ్గు వెయ్యాలి. తులసికోట కి పూజా చేస్తూ ఉండాలి.

అలాగే లక్ష్మి దేవికి పూజా చేస్తూ ఉండాలి.. డబ్బును ఏప్పుడు శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి.. పొద్దున్న లేచాక ఇంటి ముందు తలుపులు  అసలు తెరవకూడదు.. ఇంటి వెనుక తలుపులు తీయాలి.. ఒకవేళ ఇంట్లో ఎమన్న నెగటివ్ ఎనర్జీ ఉంటే బయటకి వెళ్ళిపోతుంది. పొద్దున్న లేచాక దేవుడు ఫోటోలు గాని, ఎవరి అరచేయి వారు చూడడం గాని చేయాలి. ఇలాంటివి పాటించడం వల్ల డబ్బు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: