కాణిపాకం.. నిజానికి నిలువుగా.. అబద్దానికి సింహ స్వప్నంగా ఉన్న ఈ కాణిపాకం ఎలా వెలసిందో తెలుసా ? అసలు ఈ ఆలయంలో వినాయకుడికి అప్పట్లో రక్తం వచ్చింది ఎందుకో తెలుసా ? అవి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చదవండి. చిత్తూరులో కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. నిత్యం ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నాడు. 

 

ఈ స్వామికి ఒక్క హిందువులే కాదు ఇతర మతస్థులూ కూడా మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు వస్తుంటారు. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఈ కాణిపాకంలో కనిపిస్తుంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ కాణిపాకం ఆలయం ఎలా వెలసింది అనేది గతంలోనే మనం ఒక కథనం రాశాము.

 

కాణిపాకం.. మన గణపయ్యకు అప్పట్లో రక్తం వచ్చింది.. ఎందుకో తెలుసా?

 

ఇక్కడ ఉన్న కథనం చదివాకా.. ఇది చదవండి. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ కాణిపాకం ఆలయంకు వచ్చి స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల నమ్ముతారు. అంటే వ్యసనాలకు బానిసలైన వారు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. 

 

అందుకే అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు కూడా కాణిపాకంలో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకుంటారు. ఇలా వీరు చేసే పనులు.. భక్తులు చెప్పే విధానం చెప్తుంటేనే తెలుస్తుంది.. కాణిపాకం వినాయకుడు ఎంత మహిమగల దేవుడు అనేది. ఇలా సత్య ప్రమాణాల దేవుడిగా మన బుజ్జి గణపయ్యను నమ్ముతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: