గత కొద్దీ కాలంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం మహిళలకు కూడా కల్పించాలని మహిళలు పోరాటం చేస్తున్నారు ..ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది...అయ్యప్ప భక్తులు మాత్రం ఆడవాళ్ళకి గుడిలోపలికి ప్రవేశించే అర్హత లేదని, అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి, శ్రద్దలతో, నిష్టగా, మాల వేసుకుని, అయ్యప్ప ని పూజిస్తామని అందువల్ల ఆడవాళ్ళకి ప్రవేశం లేదని గుడిలోపలికి రావద్దని వారిస్తున్నారు. కాని మహిళలు మాత్రం ఎందుకు ఆడవాళ్ళ మీద వివక్ష అని, మేము ఎందుకు  గుడి లోపలికి ప్రవేశించకూడదని ఆందోళనలు కొనసాగిస్తున్నారు..

 


ఈ విషయం పై తాజాగా ప్రముఖ గాయకుడు అయిన 'యేసుదాసు 'గారు స్పందించారు... అయన పాడే అయ్యప్ప స్వామి పాటలు అంత  ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి.. "హరివారసనం".... పాట ఎంతో ఫేమస్.. ఆ పాట నిత్యం అయ్యప్ప స్వామి పూజలో వినిపిస్తూనే ఉంటుంది... గుడి లోపలికి ఆడవాళ్ళ ప్రవేశం విషయమై యేసుదాసు సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఈపుడు ఆ వ్యాఖ్యలు చర్చనీయాశం అయ్యాయి.. శబరిమలలో మహిళలు ప్రవేశిస్తే.. అయ్యప్ప భక్తుల ఆలోచన, శ్రద్ద పక్కకు జరిగే అవకాశం ఉంటుందని అందుకే వారు అక్కడికి వెళ్లొద్దని తెలిపాడు.
ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ అందమైన అమ్మాయిలు నేటి ఆదునిక వస్త్రాధారణతో శబరిమలకు వెళితే అయ్యప్ప కళ్లు తెరిచి చూడడు. కానీ మిగతా భక్తుల దృష్టి మారొచ్చు. అందుకే వారిని అక్కడికి రావొద్దని అంటున్నాము. వారు వెళ్లగలిగే దేవాలయాలెన్నో ఉన్నాయి.. 

 

 ఈ విషయం పై ప్రముఖ గాయని చిన్మయి స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.. ప్రస్తుతం అంతా మారిపోయింది.. అపుడు దీక్ష సమయంలో అసలు భార్యలని దరిదాపుల్లో ఉంచేవాళ్ళు కాదు. కాని కాలం మారింది. తాజాగా యేసుదాస్ చేసిన కామెంట్స్‌పైనా చిన్మయి సెటైర్లు వేసింది. ‘డియర్ అయ్యప్ప.. మీ భక్తుల నుంచి నన్ను కాపాడండి' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం చిన్మయి వేసిన ఈ సెటైర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. గత కొంత కాలం నుంచి చిన్మయి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది... మహిళల విషయంలో స్పందిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: