శివుడు బోలా శంకరుడు... కొలిచిన భక్తులకు కొంగుబంగారమై ప్రత్యక్షమయ్యే భగవానుడు శివుడు. పరమేశ్వర మహత్యాన్ని లోకంలో సుప్రతిష్టం చేసింది  .. పరమేశ్వరుని దగ్గర నుంచి ముల్లోకాలను రక్షించే బాధ్యతను స్వీకరించింది అరివీర భయంకరుడు వీరభద్ర స్వామి. అందుకే వీరభద్ర ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడు ఉంటాయి . అలాంటి ఆలయాల్లో ఒక విశిష్టమైన ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొంతపల్లి గ్రామంలో భక్తుల కొంగుబంగారమై ఆధ్యాత్మిక దామంగ  అలరారుతూ ఉంటుంది శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయం ఎంతో విశిష్ట చరిత్రతో  అలలారుతుంది. ఆలయానికి కాకతీయుల నాటి చరిత్ర ఉన్నది. కాకతీయ కాలంలోనే ఇక్కడ వీరభద్ర స్వామి శ్రీ భద్రకాళీ సమేతంగా వెలసి నిత్యపూజలు అందుకుంటూ విరాజిల్లుతున్నారు. వీరభద్ర స్వామి పశువుల కాపరి రూపంలో అక్కడి ప్రజలకు ఆలయాన్ని నిర్మించమని చెప్పి మాయమైనట్లు ఈ ఆలయం. మీద  కథనం కూడా ఉంది. 

 

 

 కాగా ప్రస్తుతం బొంతపల్లి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చే దేవుడిగా అలరారుతూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ నిత్యపూజలు అందుకుంటూ కొలువు తీరి ఉన్నాడు. గండ దీపం ఆరాధన... తల వెంట్రుకలు సమర్పణ..వ్రతాలు హోమాలు అని ఈ ఆలయంలో జరుగుతుంటాయి . ఆలయం లోపలికి ప్రవేశించగానే ప్రతి భక్తునికి  ఆధ్యాత్మిక అనుభూతి నిండిపోయి.. మనసులో  భక్తిభావం ఏర్పడుతూ ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే వీరభద్ర ఎదురుగా ఉన్న భారీగా ఉండే నంది విగ్రహం కనిపిస్తుంది. ఆ నంది తలపై నుండి వీరభద్రున్ని  చూస్తే సకల పాపాలు హరించుకు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నంది విగ్రహం పక్కనే  భారీ ఎత్తున ఆలయ ధ్వజస్తంభం నిర్మితమై ఉంటుంది.

 

 

 ఇక ఆలయంలోకి ప్రవేశించిన భక్తుల వీరభద్ర స్వామి నామస్మరణ తో ఆలయం మారుమోగుతూ ఉంటుంది. వీరభద్ర స్వామి ఆలయానికి ప్రవేశించేముందు పక్కనే ఆది  దేవుడు వినాయకుడి ఆలయం నిర్మితమై ఉంటుంది. భక్తులందరూ ఆది  దేవుడికి పూజించిన అనంతరం వీరభద్రస్వామి ఆలయంలో ప్రవేశించి స్వామివారికి విశేష పూజలు చేస్తూ ఉంటారు. ఇక స్వామివారి ఆలయం చెంతనే  మహంకాళి ఆలయం కూడా అలరారుతూ ఉంటుంది. వీరభద్ర స్వామి దర్శనానికి వెళ్లిన భక్తులు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రులు అవుతారు. ఇరవై నాలుగు స్తంభాలతో  ఈ ఆలయం విశాలంగా  నిర్మించబడి ఉంటుంది. ఆలయంలో ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక అనుభూతి తో విరాజిల్లుతూ ఉంటాడు వీరభద్రుడు. అక్కడే  మహంకాళి ఆలయం ముందు 8 శ్రీ చక్రాలు ఉండగా..  మహంకాళి ఆలయంలో తొమ్మిదవ శ్రీ చక్రం  ఉంటుంది. ఎంతో మంది నవ దంపతులు ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరుపుతుంటారు . 

 

 

 వీరభద్రుడి ప్రీతిపాత్రుడైన పరమశివుని శివలింగం  వీరభద్రుడి ముందు కొలువై ఉంటుంది. పాలాభిషేకం తైలాభిషేకాలు పరమశివుడికి జరుగుతు ఉంటాయి . అరివీర భయంకరుడు అయిన వీరభద్రుడు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తూ ప్రజలందరిని తన చల్లని చూపులతో రక్షిస్తూ ఉంటాడు. మీరు కూడా ఈ ఆలయానికి వెళ్లి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: