తమ ఆరాధ్య దైవం శ్రీరామన్నారాయణుని కృపతో సకల చరాచరాలు ఈ లోకంలో సుఖ శాంతులతో జీవిస్తున్నాయని హిదువుల నమ్మకం. శ్రీదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి దివ్య మంత్రం నిత్యం పఠిస్తే, సకల శుభాలు జరిగి, మనకు పాప హరణం అవుతుందని వారి నమ్మకం. ఇక మనదేశంలో ఎంతో ప్రసిద్దిగాంచిన శ్రీ నారాయణుని దివ్య క్షేత్రాల్లో ఒకటైన భుజ్ మందిర్ గురించి ఇప్పుడు కొన్ని విశేషాలు తెలుసుకుందాం. 

 

గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ ప్రాతంలో కొలువై ఉన్న ఈ దేవాలయానికి చేరుకోవాలంటే ముందుగా గుజరాత్ లోని తీర్థ్ ధామ్ కు చేరుకొని, అక్కడి నుండి రోడ్ మార్గాన శ్రీ స్వామి నారాయణ మార్గ్ గుండా వెళ్ళాలి, కొంతదూరం వెళ్ళాక సిటీకి వ్యతిరేక దిశలో రోడ్ పై మనకు స్వామి నారాయణ భుజ్ మందిర్ దర్శనం ఇస్తుంది. నిత్యం ఇక్కడి స్వామికి హారతులు, పూజలు నిర్వహించడంతో పాటు, గుడి ట్రస్ట్ ద్వారా పోషింపబడుతున్న గోమాతల ద్వారా తీసిన పాలతో అక్కడ నిత్య నైవేద్యం సమర్పణ జరుగుతుంది. అలానే ప్రసిద్ధ పండుగల సమయంలో స్వచ్ఛమైన ఆవుపాలతో చేయబడిన పలు రకాల ప్రసాదాలను వండి, భక్తులకు అందిస్తారు. 

 

అక్కడి పురాణాల ప్రకారం, శ్రీరామన్నారాయణుని మహాభక్తులైన గంగారాం భాయ్, మరియు సుందర్ జి భాయ్ తదితరులు నారాయణుని దివ్య పండుగైన ఫుల్దోల్ ను ఎంతో ఆనందంతో జరుపుకుంటుండగా, వారి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన నారాయణుడు, భుజ్ ప్రాంతంలో తన ఆలయాన్ని నిర్మించమని కోరారడంతో, భక్తులందరూ తమ శక్తి కొలది విరాళాలు అందించి అక్కడ ఈ దివ్య ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఎంతో సుప్రసిద్ధమైన ఈ ఆలయానికి, ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాల వారు మాత్రమే కాక పలు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు విచ్చేసి భుజ్ మందిర్ లో కొలువై ఉన్న నారాయణుని దర్శనం చేసుకుని వెళ్తుంటారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: