+ ఏపీ విష‌యానికి వ‌స్తే.. లంబ‌సింగి అత్యంత ప‌ర్యాట‌క ప్రాంతాల జాబితాలో చేరిపోయింది.
+ విజ‌య‌వాడ స‌మీపంలోని భ‌వానీ ఐలాండ్ స‌హా, గోదావ‌రి, కృష్ణా న‌దుల సంగ‌మ స్థలం కూడా ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చెందింది.
+ విశాఖ‌లోని ఆర్కే బీచ్ తొలి స్థానం నిలుపుకొంది. ఉత్త‌రాంధ్ర‌లోనే కాకుండా రాష్ట్ర విభ‌జ‌న‌తో ఇప్పుడు విశాఖ దేశ‌వ్యాప్తంగా మంచి ప‌ర్యాట‌క క్షేత్రంగాను. ఐటీ ప్రాంతంగాను విరాజిల్లుతోంది. రాష్ట్ర విభ‌జ‌న విశాఖ ద‌శ‌, దిశ‌ను మార్చేసింది.

 

+ తిరుప‌తి పుణ్య‌క్షేత్రంగానేకాకుండా ఇటీవ‌ల కాలంలో ప‌ర్యాట‌క ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది.
+ రాజ‌ధాని ప్రాంతంగా అమ‌రావ‌తి కూడా మంచి ప‌ర్యాట‌క ప్రాంతంగా ప్ర‌జ‌లు గుర్తించారు. ఇక్క‌డ అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంతో రాజ‌ధాని చుట్టూ ఉన్న అనేక పుణ్య‌క్షేత్రాలు, ప్రాంతాలు కూడా ప‌ర్యాట‌కంగా మంచి అభివృద్ధి చెందాయి.
+ విశాఖ‌లో బెలూన్ల ఫెస్టివ‌ల్ స‌హా ఐటీ రంగం అభివృద్దితో ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.
+ క‌డ‌ప ద‌ర్గా ప‌ర్యాటక జాబితాలో చేరిపోయింది

 

+ అనంత‌పురం స‌త్యాసాయి నిగ‌మామ‌గం.. మ‌రో ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క ప్రాంతంగా గుర్తింపు సాధించింది.
+ కోన‌సీమ‌కు ఈ ఏడాది ఐఎస్ వో గుర్తింపు ల‌భించింది. బంద‌రు ల‌డ్డూకు కూడా ఐఎస్ వో గుర్తింపు ల‌భించింది.

 

+ తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. అత్యంత సుంద‌ర ప‌ర్యాట‌క ప్రాంతంగా హైద‌రాబాద్ త‌న పేరును మ‌రోసారి నిలుపుకొంది. మ‌రోసారి హైద‌రాబాద్ ప్ర‌పంచ చిత్ర ప‌టంపై త‌న బ్రాండ్ ఇమేజ్ చాటుకుంది.
+ వ‌రంగ‌ల్ ప‌ర్యాట‌క కేంద్రంగా పేరు తెచ్చుకుంది. ల‌క్నారం చెరువుతో పాటు ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌సిద్ధి చెందిన ప‌ర్యాట‌క ప్రాంతంగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.
+ యాద‌గిరి మ‌హా ప్రాకార నిర్మాణంతో ఇప్ప‌టికే ఉన్న పేరును మ‌రింత ఇనుమ‌డింప జేసుకుంది. యాదాద్ర‌ని దేశంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క పుణ్య‌క్షేత్రాల జాబితాలో చేర్చేలా కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకుని మ‌రీ అభివృద్ధి చేస్తున్నారు. య‌రో ఆరేడు నెల‌ల‌కు యాదాద్రి పూర్తిగా నిర్మాణం జ‌రుపుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: