ఏపీలో   నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త తీసుకొని రావడానికి సిద్దం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం-TTD . తిరుపతిలో టీటీడీలో భారీగా ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక  టీటీడీలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, మల్టీ పర్పస్ వర్కర్, డ్రైవర్ ఇలా చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో నోటిఫికేషన్ విడుదల చేయాలనీ టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అధికారుల లెక్కల ప్రకారం టీటీడీ కార్యాలయాలు, అనుబంధ సంస్థల్లో మొత్తం 9546 ఖాళీల భర్తీకి అనుమతి వచ్చినట్లు సమాచారం. ఇక సెప్టెంబర్ 2019 నాటికి 4524 ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం మరో 5022 ఖాళీలు ఉన్నాయి అని అర్థం అవుతుంది. ఈ పోస్టుల్ని త్వరలో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే భారీ ఉద్యోగాలతో టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని ప్రచారం కొనసాగుతుంది. ఈ భర్తీలకు  స్థానికులకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్లు కూడా చేయడం జరుగుతుంది. 

 

ప్రస్తుతం  అధికారిక లెక్కల ప్రకారం టీటీడీలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇలా....


టైపిస్ట్- 101 
షరాఫ్ / అసిస్టెంట్- 151
ఆఫీస్ సబార్డినేట్- 600
లోయర్ డివిజన్ స్టెనో- 13
మ్యూజియం కీపర్ (ఎడ్యుకేషన్)- 2
టెక్నికల్ అసిస్టెంట్- 6
ప్రింటింగ్ టెక్నీషియన్- 14
మజ్దూర్స్- 192
ఘాట్ రోడ్ కూలీ- 19 
ఫీల్డ్ అసిస్టెంట్ (క్వాలిటీ కంట్రోల్)- 4
సహాయకుడు (ఎలెక్ట్రికల్)- 104
సహాయకుడు (WW)- 127
సహాయకుడు (స్కల్ప్చర్)- 5
సహాయకుడు (పిఏ వింగ్)- 18
సహాయకుడు (టీవీ వింగ్)- 9
శానిటరీ వర్కర్- 514
స్వీపర్- 456
మల్టీ పర్పస్ వర్కర్- 127 
సెక్యూరిటీ గార్డ్స్- 314
ఆఫీస్ సబార్డినేట్ కమ్ వాచ్‌మ్యాన్- 26
వాచ్‌మ్యాన్- 3
కాపర్ ప్లేట్ క్లీనర్- 1
ఫారెస్ట్ మజ్దూర్స్- 172 

 

ఇలా చాలా పోస్టులకు  ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది.ఇక ముఖ్య గమనిక   టీటీడీలో ఉద్యోగాల పేరుతో దళారులు మోసం చేసే అవకాశాలు చాల ఉన్నాయి. అర్హత, ఆసక్తిగలవారు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే నోటిఫికేషన్ వివరాలు చూసి అప్లై చేసుకోవడం చాల మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: