క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. ఏసు క్రీస్తు పుట్టిన రోజును డిసెంబర్ 25 వ రోజున జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) , నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన క్రైస్తవ మత మూలపురుషుడు. డిసెంబరు 24న అర్ధరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబరు 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్‌గా జరుపుకుంటారు.

 

క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్‌మస్‌ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత.అంతకాక, యేసు వివిధ ఇతర మతములలో కూడ ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడినాడు.

 

ఈయన సాధారణంగా యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళి బాలయేసును దర్శించిన ముగ్గురు జ్ఞానులు పరమానంద భరితులయ్యారు.

 

ఆ సంతోషానికి గుర్తుగా వారు బాలయేసుకు మూడు కానుకలను సమర్పించారు. అవి బంగారము, బోళం, పరిమళ సాంబ్రాణి. వారు సమర్పించిన బంగారం క్రీస్తు ప్రభువు పరిశుద్ధతకు, పవిత్రతకు చిహ్నంగా కనబడుతుంది. బోళం సమర్పణకు సూచన. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమతో సమర్పించిన రీతిలో అందరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్‌ పర్వదినం ప్రాముఖ్యం. 'నిన్ను వలే నీ పొరుగువాణ్ని ప్రేమించు' ఇది ఆయన చిన్నవాక్యంలో అందించిన అద్భుతమైన ఉపదేశం.

 

క్రిస్‌మస్ ముందు రోజు రాత్రి శాంతా క్లాజ్ ఆకాశం నుంచి ధృవపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు. ఇలా ఉంచితే శాంతా క్లాజ్ వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని నమ్మకంశాంతా క్లాజ్ బైబిల్ లో ఒక పాత్ర అని పురాణంలో ఉంది. పవిత్ర బైబిల్ లో శాంతా క్లాజ్ తెలుపు గడ్డం మరియు ఎరుపు రంగు దుస్తులతో సాధువు మాదిరి ఉంటాడని చెప్పబడింది..

 

క్రిస్‌మస్ రోజున బంధు మిత్రుల ఇళ్ళకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు. క్రిస్‌మస్‌ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను సుఖసంతోషాలను తెస్తుందని నమ్ముతారు. అందరు ఆనందంగా క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొనాలని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: