రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రైస్తవులు అందరూ చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలోని చర్చలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాష్ట్రంలోని అన్ని చర్చీలు జనసందోహంగంగా  మారిపోయాయి. అన్ని చర్చిలలో క్రైస్తవులు భారీ ఎత్తున పోటెత్తారు. యేసయ్య మమ్మల్ని చల్లగా చూడాలి అంటూ అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేసారు . చర్చలు అన్నింటిలో కేక్ కట్ చేసి ఏసు పుట్టినరోజు జరుపుకున్నారు క్రైస్తవ సోదరులు. ఇక చర్చి ఫాదర్ లు  అందరూ యేసు యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఏసుప్రభు భూమిమీద జన్మించడానికి గల కారణం... భూమి మీద యేసు  పాపాలను ప్రక్షాళన చేసిన విధానం... మానవుల పాపములను యేసు ఏ విధముగా ప్రక్షాళన చేసారు అనే విషయాలను భక్తులకు తెలియజేశారు చర్చి ఫాదర్లు . 

 

 

 

 క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ ప్రత్యేకమైనది కావడంతో... కొత్త దుస్తులు ధరించి చర్చిల వద్దకు చేరుకున్నారు క్రైస్తవులు. అన్ని చర్చిలలో ప్రముఖులు సైతం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా అన్ని  చర్చిలు   క్రైస్తవులతో నిండిపోగా.. తమ తప్పులు మన్నించి పాప ప్రక్షాళన చేయి తండ్రీ అంటూ యేసుని  కోరుకున్నారు క్రైస్తవ సోదర సోదరీమణులు. హైదరాబాద్తో పాటు జిల్లాలో అని చర్చిలు  సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

 

 

 

 చర్చిలో క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సీబీసీ  క్రిస్మస్ వేడుకల్లో  ప్రభుత్వం విప్  భాస్కర్,  జెడ్పి చైర్ పర్సన్ సుధీర్ కుమార్ ఎంపీ దయాకర్ పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ దారిలో నీ ఫేర్ వ్యూ మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో  ఎంపీ డాక్టర్ రంజిత్  రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అందరూ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.పాశ్చాత్య  దేశాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: