టిటిడి.. తిరుమల తిరుపతి దేవస్థానములు.. ఈ బోర్డు రాష్ట్రంలో హిందూ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తోంది. అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో పథకం కూడా చేరింది. అదే దళితులకు వేద విద్య, బాల వికాస కేంద్రాలు.

 

ఏపీలో మరిన్ని బాల వికాస కేంద్రాల ఏర్పాటుకు కృషిచేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 115 బాల వికాస కేంద్రాలు ఉన్నాయని ఆయన చెప్పారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బాల వికాస కేంద్రాలు హిందూ ధర్మ రక్షణకు దోహదపడతాయన్నారు.

 

వీటిని మరిన్ని నిర్మించేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన వివరించారు. అదే విధంగా రాష్ట్రంలో 500 దేవాలయాలు నిర్మించామని చెప్పారు. అలాగే కృష్ణా జిల్లా దళిత వాడల్లో 55 దేవాలయాలు నిర్మించామన్నారు. దళితులకు వేదం, మంత్ర పఠనం నేర్పిస్తున్నామన్నారు. అదే విధంగా చదువురాని పెద్దలకు విద్య నేర్పేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి నెలా ధర్మిక సదస్సులు నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: