భూమికి సూర్యుడు జీవదాత. చంద్రుడు చల్లని వెలుగులు పంచుతాడు. అలాంటి సూర్యచంద్రులను రాహుకేతువులు మింగడాన్ని అరిష్టంగా భావిస్తారు. రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడం వల్లనే గ్రహణాలు ఏర్పడతాయన్నది పురాణ కాలం నుంచి వస్తున్న నమ్మిక. రాహుకేతువులు దుష్టగ్రహాలు అయినందున వాటినుంచి గ్రహణ సమయంలో చెడు కిరణాలు ప్రసరిస్తాయని, ఆ కిరణాలు ఆలయాలపై పడితే అశుభం అని భావిస్తారు. అందుకే గ్రహణం వేళ ఆలయాలు మూసివేస్తారు. దర్శనానికి భక్తులను అనుమతించరు.  కాని గ్రహణసమయంలో కూడా ఈ గుడి తెరిచి ఉంచి, భక్తులకు గ్రహణం రోజు స్వామివారికి ప్రత్యేకమైన  దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు.  వివరాల్లోకి వెళితే..

 

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళ హస్తీశ్వరుణి గుడి.  శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా కొలుస్తారు. ఈ గుడిని గ్రహణం పట్టని దేవాలయంగా కూడా పిలుస్తుంటారు. శ్రీకాళహస్తిని  అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు, ఇతర ఏ కారణాలచేతనైనా ఎప్పుడు మూసివేయరు. అయితే రేపు సూర్యగ్రహణం పట్టనుంది. ఇదే ఈ సంవత్సరపు ఆఖరి గ్రహణం.  గ్రహణం సంధర్భంగా కాళహస్తీశ్వరుని గుడి తెరిచి ఉంచుతారు.

 

గ్రహణ సమయంలో దేవాలయంలో కొలువై ఉన్న శ్రీకాళ హస్తీశ్వరునికి ప్రత్యేక  అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యచంద్రులు, అగ్ని భట్టారకుడు, నవగ్రహాలు , 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తాడని, అందువల్ల రాహువు, కేతువు ఆలయంలోకి  ప్రవేశించలేవని భక్తులు నమ్ముతారు. 

 

ఈ కారణంగానే భక్తులు శ్రీకాళహస్తిలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు. సామాన్యుల దగ్గనుండి, విఐపీలు, సెబ్రిటీలు ఇక్కడ గ్రహణంరోజు ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా సూర్య గ్రహణం ప్రారంభం సమయంలో, చంద్ర గ్రహణం పూర్తయిన తర్వాత గుడిలో శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. అందుకే గ్రహణ సమంయలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తారు. అధేవిదంగా రేపు  ఉదయం గ్రహణం పట్టిన సమయంలో అభిషేకాలు నిర్వహిస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: