సంవత్సరం చివర ఘట్టాలలో ఐదవ గ్రహణం ఇవ్వాలా ఉదయం 8:03 నిమిషాల నుండి మొదలై ఉదయం 11:11 గంటలకు ముగిసింది. మూడు గంటలపాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కొద్ది క్షణాల ముందు ముగిసింది.  మన దేశంతో పాటు కొన్ని ఆసియాలో కొన్ని దేశాల్లో గ్రహణం కొనసాగింది. గ్రహణం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆలయాలు బుధవారం రాత్రి నుండి తలుపులు మూయ్య బడటం జరిగాయి. అయితే గ్రహణం ముగిసిన నేపథ్యంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆలయాలు  మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం, సంప్రోక్షణ తర్వాత పునఃప్రారంభించారు. ధనుస్సు రాశి వారు ఈ గ్రహణం చూడరాదని, ముఖ్యంగా మూల నక్షత్రం వారు ఈ గ్రహణం చూస్తే అనారోగ్య హేతువని జ్యోతిషులు తెలిపారు.

 

తాజాగా వచ్చిన గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుందో రాశి కి సంబంధించిన వాళ్ల గురించి ధర్మ శాస్త్రం మరియు జ్యోతిష్య పండితులు చెబుతున్నది ఏమిటంటే గ్రహణం ఏ రాశి లో సంభవిస్తుందో ఆ రాశి వారికి దోషం అని అనారోగ్యానికి కారణం అవుతుందని అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో దోష పరిహారాలు చేసుకోవాలని చూసే రాశి వాళ్లు ఖచ్చితంగా బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి పరిహారాలు మూడు విధాలుగా చేయవచ్చు అని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. ఉత్తమం, మధ్యమం, అధమం. ఈ దానం గ్రహణం విడిచిన తరువాతే చేయాలని, దానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలని అంటున్నారు.

 

గ్రహణం అయిపోయాక కచ్చితంగా తలంటు స్నానం చేసి సమీపంలో ఉన్న దేవాలయం కానీ నదీతీరంలో గాని బ్రాహ్మణులతో సంకల్పం చేయించుకోవాలి ఒకవేళ అది కుదరకపోతే బ్రాహ్మణులు అందుబాటులో లేకపోతే సంకల్పం చేసుకుని దానం చేయాలి అని అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇలా ప్రతి ఒక్క రాశి వారు చేయాల్సిందే అని గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుందో ఆ రాశి చెందిన వాళ్ళు చేయాల్సిందే అని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: