తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత ప్రతిష్ఠతో ఉందో తెలిసిన విషయమే. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు అవుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో విరాజిల్లుతూ ఉంటాడు. ఇక ఆలయం మొత్తం ఏడుకొండలవాడ వెంకటరమణ  గోవిందా గోవిందా అనే  నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. అయితే కాలంతో సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు భక్తుల రద్దీ ఉంటుంది. సంవత్సరం పొడవునా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. 

 

 

 

 

 ఇకపోతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతుండటంతో   చలి తీవ్రత  పెరిగిపోతుంది. దీంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్రమైన చలితో గజగజ వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలి తో కనీసం కాలు బయట పెట్టాలనే జంకుతున్నారు. ఇక ఏడు కొండల ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. మామూలుగానే ఏడుకొండలు ప్రాంతంలో చల్లగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పారిపోయి  చలి తీవ్రత పెరుగుతుండడంతో... ఏడుకొండలు పూర్తిగా పొగ  మంచుతో కప్పబడి ఉంటుంది.దీంతో  భక్తుల రాక కూడా తగ్గింది. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఆలయ అధికారులు సూచిస్తున్నారు. 

 

 

 

 ఏడుకొండలు ప్రాంతంలో పొగమంచుతో కమ్ముకొని తీవ్రమైన చలి ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడక తప్పేలా లేదు. ఇలాంటి సమయంలో తీవ్రమైన చలి నుంచి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని తిరుమలకు వెళితే మంచిది. ఎందుకంటే తీవ్రమైన చలితో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు... తిరుమలలో పెరిగిపోయిన తీవ్రమైన చలితో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది . తీవ్రమైన చలి నుంచి రక్షించుకోవడానికి స్వేటర్స్ లాంటివి వెంట తీసుకెళ్తే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: