శబరిమల యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుంటారు. ఎంతో నిష్టతో ఇరుముడి తలపై పెట్టుకుని.. శబరిమల యాత్ర చేస్తారు. కాలినడకన అయ్యప్పను దర్శించుకుంటారు. 40 రోజులు ఎంతో భక్తితో నిష్టతో పూజలు చేస్తూ.. ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడతారు.

 

అయితే శబరిమల యాత్ర చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా కొన్ని అత్యవసరమైన ఫోన్ నెంబర్లు దగ్గర ఉంచుకోవాలి. అవేంటంటే.. శబరిమల సహాయ అధికారి ఫోన్ నెంబర్. 04735-202019. యాత్రలో ఏ సమస్య వచ్చినా ఈయనకు ఫోన్ చేయవచ్చు.

 

ఇక శబరిమలలో వసతికి సంబంధించిన సమస్యలు ఉంటే వసతి అధికారిని సంప్రదించవచ్చు. ఆయన ఫోన్ నెంబర్ 04735-202049. ఇక ఇతర విషయాల కోసం ఫిర్యాదులు,ఫీడ్ బ్యాక్ ఇవ్వడం కోసం శబరిమల పీఆర్వో నెంబర్ కూడా అవసరం అది. 04735-202048.

 

వీటితో పాటు కార్డియాలజీ సెంటర్ నెంబర్ - 04735-202050. పంబ పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 04735-203386, పంబ పోలీస్ స్టేషన్ నెంబర్. 04735- 203412). వీటితో పాటు శబరిమల పోలీస్ స్టేషన్ 04735-202014.

మరింత సమాచారం తెలుసుకోండి: