ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈ రోజు బుదవారం,01.01.2020 ఉదయం 6 గంటల సమయానికి,నూతన సంవత్సర‌ శుభాకాంక్షలు...!!! తిరుమల: 18C°-24℃°

 

• నిన్న 78,460 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 30 గదుల్లో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 20 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 4.76 కోట్లు.

 

• నిన్న 20,257 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు.

 

• నిన్న 18,491 మంది  భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి,

 

గమనిక:

 

• ఆంగ్ల సంవత్సరాది సంద‌ర్భంగా డిసెంబరు 30 నుండి జనవరి 1వ  తేదీ వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలు, గదుల  కేటాయింపును నిలిపివేయ‌డ‌మైన‌ది.

 

• భక్తుల రద్దీ నేపథ్యంలో నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో, వైకుంఠ  ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: