తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజుల పాటు పెంచుతారన్న వార్తలపై ఓ క్లారిటీ వచ్చేసింది. వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులకే పరిమితం చేయాలని టీటీడీ నిర్ణయించింది. పాత సంప్రదాయాలను అనుసరిస్తూ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించనున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.

 

తిరుమల అన్నమయ్య భవనంలో అత్యవసరంగా సమావేశమైన ధర్మకర్తల మండలి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన ప్రకటించారు. శ్రీరంగం తరహాలో పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే.

 

దీనిపై విచారించిన న్యాయస్థానం ఆరో తేదీలోపు టీటీడీ అభిప్రాయాలను తెలియచేయాలని సూచించింది. దీంతో అత్యవరసరంగా సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. సమావేశంలో ఏకాదశి, ద్వాదశిలలో మాత్రమే వైకంఠ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన తెలిపారు.

 

భవిష్యత్తులో పదిరోజుల పాటు దర్శనం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాల పరిశీలనకు అదనపు ఈవో అధ్యక్షతన కమిటీ వేశామన్నారు. జనవరి 20 నుంచి శ్రీవారి దర్శించుకునే ప్రతి భక్తునికి ఒ‍క ఉచిత లడ్డు ఇవ్వడంతో పాటు వివిధ రకాల రాయితీ లడ్లను నిలిపివేయనున్నట్లు ఛైర్మన్‌ స్పష్టం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: