మనలో చాలామంది ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, పెళ్లై చాలా సంవత్సరాలైనప్పటికీ పిల్లలు పుట్టకపోయినా, అనుకోని సమస్యలు మరియు కష్టాలు వస్తే దేవున్ని ఆశ్రయిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించి కోరికలు చెప్పుకొని ఆ కోరికలను నెరవేర్చాలని దేవుడిని కోరుకుంటారు. ఆ కోరికలు నెరవేరిన పక్షంలో దేవునికి మొక్కుకున్న మొక్కులను నెరవేరుస్తూ ఉంటారు. 
 
కొందరు తలనీలాల రూపంలో మొక్కులను చెల్లిస్తే మరికొందరు డబ్బు, బంగారం, వెండి రూపంలో మొక్కులను చెల్లిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న శివుడికి ఇవేం ఇవ్వవలసిన అవసరం లేదు. మనం కోరిన కోరికలు నెరవేరితే ఇక్కడి శివుడికి మట్టిబొమ్మ మాత్రం ఇస్తే చాలు. ఈ పుణ్యక్షేత్రం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలకు 12 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం బెల్తంగడి తాలూకా సూర్య గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో శివుడు లింగ రూపంలో వెలిశాడు. 
 
ఈ క్షేత్రంలో ఉండే కోనేరు సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఈ పుణ్యక్షేత్రంలో కనిపించే జంట శిలలను పార్వతీ పరమేశ్వరులుగా గ్రామస్థులు భావిస్తారు. పురాణాల ప్రకారం భ్రుగు మహర్షి తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు శిలా రూపాల్లో ఈ ప్రాంతాల్లో వెలిశారని చెబుతున్నారు. పూర్వం ఒక వ్యక్తి కైలాస ప్రవేశాన్ని కోరుతూ మట్టితో బిల్వ పత్రాల ఆకారాన్ని తయారు చేసి శివునికి సమర్పించి కైలాస ప్రవేశానికి అర్హత పొందాడు. అప్పటినుండి ఇక్కడ మట్టిబొమ్మలతో పూజించే సాంప్రదాయం మొదలైంది. ముందుగా మొక్కుకొని కోరుకున్న కోరిక తీరితే ఆ కోరికను బట్టి దానికి సంబంధించిన బొమ్మను భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడి ఉద్యానవనంలో భక్తులు చెల్లించిన బొమ్మలు గుట్టలుగుట్టలుగా కనిపిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: