హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆయన దేవాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో.  ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆ ఊరిలో హనుమంతుడిని పూజించారు సరికదా ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. అంతేకాదు.. క‌నీసం ఆంజనేయుడని, హనుమంతుడని, మారుతి అని పేర్లు కూడా పెట్టరు. ఆ ఊరి పేరు ద్రోణగిరి.

 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో కలదు. దేశ రాజధాని ఢిల్లీ నుండి 400 కిలోమీటర్ల దూరంలో, 6 గ్రామాల సమూహంతో ఏర్పడ్డదే ద్రోణగిరి. మ‌రి ఆంజనేయ స్వామిని ఇక్క‌డ ఎందుకు అంత విప‌రీతంగా ద్వేషిస్తారో తెలుసా..? రామాయణ కాలం అంటే త్రేతాయుగం అని. రాముడు - రావణాసురుడు మధ్య యుద్ధం జరిగే సమయంలో లక్షణుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు గుర్తుందా ? అప్పుడు ఆంజనేయస్వామి ఎక్కడో హిమాలయాల పర్వతాల వద్ద ఉన్న సంజీవని పర్వతం తీసుకొని వచ్చి లక్షణుడిని మూర్ఛ నుండి తప్పిస్తాడు క‌దా.

 

అయితే ఆ సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయస్వామి తీసుకెళ్ళేసరికి ఇక్కడున్నవారికి కోపం కట్టలు తెగిందట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి పూజలు చేయటం మానేశారు. క‌నీసం ఆ పేరు పలికినా అదో నేరంగా భావిస్తారు. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే.. ద్రోణగిరి లో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠం కలదు. గుడిలో కొలువైన దేవతను 'దునగిరి దేవి' గా కొలుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: