శబరిమలలో మహిళలకు ప్రవేశం వివాదంపై ఉన్న సంగతి తెలిసిందే. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. ఇప్పుడు ఈ వివాదంపై మరోసారి వాదనలు జరగనున్నాయి.

 

ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 13 నుంచి వాదనలు వింటుంది. దీనిపై తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ నెల 13 నుంచి వాదనలు వినబోతోంది. ఈ మేరకు సుప్రీం కోర్టు సోమవారం నోటీసులో పేర్కొంది. ఈ ఒక్క కేసు మాత్రమే కాదు.. శబరిమలతో పాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి అంశాలపైనా విచారణ జరపనుంది.

 

ఇప్పుడు ఈ కేసుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మత విశ్వాసాలకూ, చట్టాలకూ మధ్య జరుగుతున్న ఈ న్యాయ పోరాటం ఏ మలుపులు తీసుకుంటుందో అన్నది ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: