అమ్మ ప్రేమ గురించి తెలియ‌నిది ఎవ్వ‌రికి ఏ కాల‌మైన అమ్మ ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఆమెకు సాటి ఎవ్వ‌రూ రాలేరు.  ఒక‌సారి మ‌న పురాణాల గురించి తెల‌సుకుందాం. అనురాగం.. అంటేనే అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ ప్రేమలోనే ఒక నమ్మకం అమరి ఉంది.. అమ్మ అంటేనే సేద దీర్చే చలివేంద్రం. త్యాగమూ, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది.. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు, అమ్మ ఉన్న చోట అదృష్టం పురి విప్పి ఆడుతుంది. బ్రహ్మ సృష్టిస్తే, అమ్మ దానికి ప్రతిసృష్టి చేస్తుంది.. జగతికి మార్గమైన అమ్మకు అన్ని సంస్కృతులు విశేష ప్రాధాన్యత ఇచ్చాయి. 

 

భారతీయ సమాజంలో వేదకాలం నుంచి అమ్మది విశిష్ట స్థానమే. అమ్మకు అగ్రస్థానం ఇచ్చి గౌరవించారు. అమ్మ ఈ పదం వినడానికే ఎంతో కమ్మగా ఉంటుంది. అమ్మ ఓ అనురాగం.... ఓ అపురూపం. అమ్మ గురించి చెప్పడానికి ఈ ప్రపంచంలో భాష సరిపోదంటే అతిశయోక్తి కాదు. పిల్లల రక్షణ కోసం సైనికుడిగా, అవసరాల్లో స్నేహితుడిగా, కష్టాల్లో కంచుకవచంగా మారిపోతుంది. ఇక పురాణాల్లోనూ చాలా మంది అమ్మలు తమ పిల్లల కోసం త్యాగాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. హిడంబి, శృతకీర్తి, కర్ణుడిని పెంచిన తల్లి రాధ, సీత, చిత్రాంగద లాంటి మహిళలు నేటి అమ్మలకు ఆదర్శంగా నిలిచారు. ఎవరి సహాయం లేకుండా ఘటోత్కచుని పెంచిన హిండంబి ఓ ఆదర్శవంతమైన అమ్మ.

 

ధుర్యోదనుడి లక్కాగృహం దహనం కుట్ర నుంచి తప్పించుకున్న పాండవులు అడవికి చేరుకున్నారు. పాండవుల రాకను పసిగట్టిన హిడింబాసురుడు వారిని చంపడానికి తన సోదరి హిడంబిని పంపాడు. అయితే, అక్కడ ఉన్న భీముడ్ని చూసి మోహించింది. దీంతో హిడింబాసురుడు అక్కడకు చేరుకుని సోదరి చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయి ఆమె ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు.

 

దీనిని అడ్డుకున్న భీముడి చేతిలో ఆ రాక్షసుడు మరణించాడు. హిడింబి ప్రేమను భీముడు అంగీకరించిన తర్వాత ఆమె జీవన విధానమే మారిపోయింది. వివాహం తర్వాత కొద్ది రోజులే కలిసున్న భీముడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఘటోత్కచుడికి జన్మనిచ్చిన హిడంబి అతడికి యుద్ధ తంత్రాలు, ఆయుధాల ప్రయోగించే విధానాన్ని ఎవరి సాయం తీసుకోకుండా నేర్పించి పరాక్రమవంతుడైన యోధుడిగా తీర్చిదిద్దింది.

 

మహాభారతంలో ఈమె పాత్ర చిన్నదైనా తన కుమారుడికి మంచి తల్లిగా, గురువుగా, సంరక్షకురాలిగా నిలిచింది. శిశుపాలుని తల్లి శృతకీర్తి గురించి మహాభారతంలోని సభా పర్వంలో ఉంది. వికృతరూపంతో జన్మించిన శిశుపాలుని చూసి అందరూ భయపడ్డారు. మూడు నేత్రాలు, నాలుగు చేతులతో భయంకరంగా ఉండే అతడిని దగ్గరకు తీసుకునేవారు కాదు.

 

అయినా, శృతకీర్తి మాత్రం తన కుమారుడి పట్ల అవిభాజ్యమైన ప్రేమను కురిపించింది. ఒకరోజు శిశుపాలుడిని కృష్ణుడు తన ఒడిలోకి తీసుకున్నప్పుడు అతడి వికృత రూపం అదృశ్యమవుతుంది. కానీ కృష్ణుణి శిశుపాలుడు అవమానించినప్పుడు శృతకీర్తి తన బిడ్డను క్షమించమని కోరుతుంది. అయితే 100 తప్పులు వరకు ఎలాంటి శిక్ష ఉండదని ఆమెకు అభయమిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: