2020 సంవత్సరంలో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడనుండగా తొలి గ్రహణం ఈరోజు సంభవించనుంది. ఈరోజు రాత్రి 10.37 గంటలకు గ్రహణం మొదలై రాత్రి 2.42 గంటల వరకు గ్రహణం కొనసాగనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం రోజున కొన్ని పనులు చేయటంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్ర గ్రహణం ప్రభావం పడకుండా ఉండాలంటే గరికను అన్ని చోట్ల ఉంచాలి. 
 
చంద్ర గ్రహణం సమయంలో దేవుడిని జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహణం సమయంలో బ్రహ్మదండు చెట్టును ఇంటి గుమ్మానికి కడితే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహణం సమయంలో పేదలకు దానధర్మాలు చేసినా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. గ్రహణం ముగిసిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి ఇంటిని అలంకరించుకోవాలి. 
 
గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదు. ఎలాంటి పానీయాలను తాగకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటే మంచిది. పదునైన వస్తువులను, కత్తులను గర్భిణులు దగ్గరగా ఉంచుకోకూడదు. గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితులలోను ఆల్కహాల్ ను తీసుకోకూడదు. గ్రహణం విడిచిన తరువాత నదీ స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచిది. నరదృష్టి కొరకు ఇళ్లు, వ్యాపార సంస్థల ముందు కట్టిన కొబ్బరి కాయలు, గుమ్మడికాయలు తీసివేసి కొత్తవి కట్టించుకుంటే గ్రహణ దృష్టి తొలగిపోయి శుభఫలితాలు కలుగుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: