సంక్రాంతి వచ్చింది తుమ్మెద.. సరదాలు తెచ్చింది తుమ్మెద! అనే పాటలు మనం వినే ఉంటాము.. అవును అలానే సంక్రాంతి వచ్చేసింది. ఎంతో ఆనందంగా కుటుంబం అంత చేసుకునే పండుగా దగ్గరలోనే ఉంది. ఇంకో రెండు రోజులు పోతే పండుగా వచ్చేస్తుంది. అయితే ఇప్పటికే సినిమాలలో సంక్రాంతి పండుగా వచ్చేసింది. 

 

ఇంకా అసలు సంక్రాంతి పండుగాకు ముగ్గులు వేస్తారు. ఒకప్పుడు అంటే ముగ్గులో వరుసలు.. చుక్కలు.. అల్లికలు అన్ని కనిపించేవి. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద చ‌క్రాలు, డిజైన్లు వ‌చ్చాయి.. అవి కింద పెట్టేసి రంగులు అద్దేస్తున్నారు.. గతంలో పెద్ద పెద్ద ముగ్గులు వేసి... రంగులు వేసి చాలా చేసేవారు.. ఇప్పుడు అవ‌న్నీ పోయ‌యి.. ఇన్‌స్టంట్ ముగ్గులు వ‌చ్చేశాయి.. ఈ త‌రంలో చాలా మంది ఎన్ని వ‌రుస‌లు ? ఎన్ని చుక్క‌లు ? అన్న‌ది కూడా తెలియ‌ని ప‌రిస్థితిలోకి వచ్చేశాం. 

 

అప్పట్లో.. ఉదయాన్నే లేచి.. ఎదురింటివాళ్ళు ఏ ముగ్గులు వేశారు.. మనం ఏ ముగ్గులు వెయ్యాలి అని ఒకటికి రెండు సార్లు ఆలోచిందుకొని.. పది వరుసల.. పన్నెండు వరుసల అని చూసుకొని ముగ్గులు వేస్తారు.. కానీ ఇప్పుడు.. జల్లాడ పట్టుకొని దాని చుట్టూ ముగ్గు పిండి వదిలి.. యూట్యూబ్ లో చూసి ఆబ్బె.. వద్దులే ఈ ముగ్గుల గురించి చర్చిండం అనవసరం. ఇది ఈనాటి ముగ్గుల లోకం.. చుక్కలు లేని ముగ్గు వరుసలు లేని ముగ్గు అప్పట్లో ఉన్నంత అందంగా లేవు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: