సంక్రాంతి ఉభయతెలుగు జిల్లాలలో అంత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకొనే పండుగ. భారతదేశం అనాదిగా వ్యవసాయ దేశం కాబట్టి  చాలా పండగలు వ్యవసాయ సంబంధమైనవిగా వుండడం సర్వసాధారణం . దేశ వ్యాప్తంగా హిందువులు అందరూ జరుపుకొనే పండుగలలో ఇది ముఖ్యమైనది. చిన్నచిన్న ఆచారాలలో తేడాలు తప్ప ముఖ్యంగా జరుపుకొనే పధ్దతి. సంక్రాంతి  కొత్తపంట చేతికొచ్చాక జరుపుకొనే పండగ అయినా.. 


ఇది  సూర్యునికి సంబంధించిన పండుగ. సూర్యుడు ఒకరాశి నుంచి మరొకరాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అని అంటారు .  ఏప్రిల్ 14 న సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించినపుడు మేష సంక్రమణం అంటాం. ఆ రోజు సౌరమానాన్ని పాటించే వారికి సంవత్సరం ప్రారంభం అవుతుంది. అంటే మన  ' తమిళతంబిలకి ' ఇలా సూర్యుడు రాశి మారడం అనేది ఆంగ్లతారీఖులతో ముడిపడి వుండడం కూడా విశేషమే.


 సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి నప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఆంగ్ల తేదీల ప్రకారం ఇది జనవరి 14 న పడుతుంది. సుమారు నాలుగు సంవత్సరాలకి ఒకసారి ( లీప్ యియర్) 15 వ తారీఖున పడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడు. కాబట్టి దీనిని ఉత్తరాయణ మని, దక్షిణ దిశగా చేసే ప్రయాణాన్ని దక్షిణాయనం అని  అంటారు. సూర్యుడు ఆరునెలలు ఉత్తరాయణం లోనూ , ఆరునెలలు దక్షిణాయణంలోనూ ప్రయాణిస్తాడు. మకర సంక్రాంతి రోజు నుంచి పగటి సమయం యెక్కువ గానూ రాత్రి సమయం తక్కువగానూ వుంటుంది. మకర సంక్రాంతి రోజు పగటి సమయం రాత్రి సమయం సమానంగా వుంటాయి .


హిందూ పురాణాల ప్రకారం ఉత్తరాయణం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే ఉత్తరాయణంలో మరణించిన వారు జనన మరణాల నుంచి విముక్తి పొంది స్వర్గ వాసం పొందుతారని నమ్మకం దీనికి ప్రమాణంగా మహాభారతంలో ఇచ్ఛా మరణ వరం కలిగిన భీష్ముడు అంప శయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచివుండి ఉత్తరాయణ ప్రవేశానంతరం ప్రాణాలు విడుస్తాడు. సంక్రాంతి పౌరాణికం గానూ, సైన్సు ప్రకారంగానూ కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: