సంక్రాంతి సంబరాలు అంటే.. గొబ్బెమ్మలు, ముగ్గులు, పతంగులు, మామిడాకులు, కోడిపందేలు, మందు, నాటు కోడి పూలు, కొత్త బట్టలు ఇలా అన్ని కలిస్తేనే సంక్రాంతి సంబరాలు. ఇలా అన్ని కలిసి రాడానికి దాదాపు సంవత్సరం వెయిట్ చేస్తాం. మనకు ఈ సంక్రాంతి అంటే ఎంతో ప్రత్యేకం.. ఎంతో ఇష్టం.. అలాంటి సంక్రాంతి ఇది. అయితే ఈ సంక్రాంతిలో వచ్చే కనుమను ముక్కాలా పండగంటారు.. ఎందుకు తెలుసా ? ఇక్కడ చదివి తెలుసుకోండి..    

 

అన్ని పండ‌గ‌ల్లోనూ సంక్రాంతి పెద్ద పండుగ. మొత్తం మూడు రోజుల‌ ఈ పండ‌గలో ప్ర‌తిరోజూ ఒక ప్ర‌త్యే కత ఉంటుంది. మూడోరోజైన క‌నుమకు మ‌రింత ప్ర‌త్యేకత ఉంది. ఇది అన్ని వ‌ర్గాల వారూ ఆనందంగా త‌మ త‌మ ఇష్టాల‌ను తీర్చుకునే పండ‌గ రోజు. మిగిలిన భోగి, సంక్రాంతికి కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. కానీ, క‌నుమ రోజు ఎలాంటి నిబంధ‌న‌లు లేవు. 

 

సురాపానం అలవాటు ఉన్న‌వారికిఈ పండ‌గ మ‌రింత ప్ర‌త్యేకం. ఇక‌, మాంసాహారులు ఖ‌చ్చితంగా క‌నుమ నాడు త‌మ‌కు న‌చ్చిన రెండు మూడు ర‌కాల మాంసా హారాన్ని వండుకుని, పెద్ద‌ల‌కు నైవేద్యంగా పెట్టుకుని ప్ర‌సాదంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు పెద్ద‌లు. ఇది అసలైన ముక్కాల పండగ కథ.. ఎంతో ఆనందంగా ఈ పాడుగాను జరుపుకోండి.. మళ్ళి మళ్ళి గుర్తుకు వచ్చేలా జరుపుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: