సంక్రాంతి సంబరాలు మొదలు అయిపోయాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంక్రాంతి పండుగలో భాగంగా రేపు మొదటి రోజు భోగి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. పొద్దున్నే లేచి భోగిమంటలు వేసి చుట్టుపక్కల ప్రజలందరూ భోగి మంటల చుట్టూ చేరి ఆడి పాడి భోగి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇంకా సూర్యుడు కూడా రాకముందే మహిళలందరూ అందంగా ముస్తాబై భోగి మంటల చుట్టూ చేరి సాంప్రదాయమైన ఆటలు ఆడుతూ ఉంటారు.తెలుగు ప్రజలకు ఇది గొప్ప సాంప్రదాయం. 

 

 

 ఇలా భోగి మంటలు వేసి చుట్టూ చేరి భోగి పండుగను జరుపు కోవడం వల్ల ఓ వైపు అగ్నిదేవుని పూజించడంతో పాటు మరోవైపు వాయుదేవునికి కూడా పూజిస్తూ ఉంటారు తెలుగు ప్రజలు. ఇక సంక్రాంతి పండుగకు భోగి పండుగ ముందు రోజు కావడంతో సంబరాలు అంబరాన్నంటాయి. ఇక గ్రామాల్లో నే కాదు నగరాల్లో కూడా ఈ భోగి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భోగి మంటలు వేసి కాలనీ వాసులు అందరూ ఒకదగ్గర చేరి.. భోగి మంటల చుట్టూ ఆడిపాడి భోగి సంబరాలను జరుపుకుంటారు. ఇక ఈ భోగి మంటల వెనక ఎన్నో పురాణగాథలు కూడా ఉన్నాయి. అయితే మన శరీరంలోని 72,000 నాడు లోకి ప్రవేశించిన  మలినాలను భోగి పండుగ బయటకు పంపుతుంది అన్నది పురాణాలు చెబుతున్నాయి.. 

 

 

 ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు... అదే అందరికీ వస్తే సమకూర్చడం దాదాపు అసాధ్యం అయినది.. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని నిరు పేదలు  కూడా ఉంటారన్నది సత్యం... కాగా దీని గురించి బాగా ఆలోచించిన మన పెద్దలు భోగిమంటల్లో పాల్గోనే సంప్రదాయం తీసుకొచ్చారు. భోగి మంటల నుంచి వచ్చే గాలి ప్రజలకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది... కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరి భోగి పండుగను జరుపుకోవటం  వల్ల ప్రజల మధ్య దూరాలను తగ్గించి ఐక్యమత్యాన్ని పెంపొందిస్తుంది భోగి పండుగ. ఈ భోగిపండుగ ఒక రకంగా అగ్ని దేవుడికి ఆరాధన మరొక రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవుడికి ఇచ్చే గౌరవం కూడా. అంతేకాదు ఈ భోగి మంటలు మానవుల్లో  అణువణువునా పేరుకుపోయిన కుళ్ళు కుతంత్రం రాగద్వేషాలను అన్నింటినీ దూరం చేసి ఐక్యమత్యాన్ని పెంచుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: