భోగి పండుగ రోజు వేకువజామునే లేచి భోగి మంటలు వేస్తుంటారు ప్రజలు. భోగి రోజు చలి తీవ్రత అధిక స్థాయిలో ఉండటం వలన భోగి మంటలు వేయాలని పండితులు సూచిస్తుంటారు. ఈ చలికాలంలో ఎక్కువగా క్రిమికీటకాలు ఇళ్లల్లో ప్రవేశిస్తాయి కాబట్టి వీటిని ఎదుర్కొనేందుకు భోగి మంటలు తమ వంతుగా పాత్ర వహిస్తాయి. భోగిమంటల వెనుక ఇంకొక అంతరార్థం ఏంటంటే... సంక్రాంతి రోజు నుండి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించగా... ఫలితంగా ఎండ వేడి లో తీవ్రత అధికంగా పెరుగుతుంది. దీంతో వాతావరణం లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకుంటాయి... అప్పుడు మానవశరీరం వాతావరణానికి అనుగుణంగా వెంటనే మారలేక బాగా ఇబ్బంది పడటంతో పాటు జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అయితే, వీటన్నిటిని ప్రతి ఒక్కరు ఎదుర్కొనే విధంగా భోగి మంటలను కనిపెట్టారు మన పెద్దలు. అయితే హోమాన్ని ఎంత పవిత్రంగా స్టార్ట్ చేస్తామో అంతే పవిత్రంగా భోగి మంటలను రగిలించాలని పురాణాలు చెబుతున్నాయి.


ఇకపోతే ధనుర్మాసంలో ఎండ పెట్టినటువంటి పిడకలను భోగిమంటల్లో వేస్తారు. ఈ పిడకలు భోగిమంటల్లో కాలిపోవడంతో గాలి శుద్ధి అవుతుంది, క్రిములు నశిస్తాయి, ప్రాణవాయువు అధికంగా పెరిగి పోతుంది. ఎన్నో ఔషధాలు కలిగినటువంటి ఈ గాలిని పీల్చడం మన శరీరానికి ఎంతో ప్రయోజనకరం. ఈ చలికాలంలో శ్వాసకు సంబంధించిన వ్యాధులు ప్రజలను బాధిస్తుంటాయి. కానీ, భోగి మంటల వల్ల ఎటువంటి వ్యాధులు మన దరికి చేరవు.


రవి, మావిడి, మేడి, ఇంకా ఇతర ఔషధ చెట్ల బెరడులను భోగి మంటల్లో వేయడం వలన అవి పెద్దదిగా మండుతాయి. అయితే, ఈ చెట్ల బెరడులు సరిగా మండటానికి ఆవు నెయ్యిని వేస్తారు. విషశమేంటంటే.. భోగి మంటల్లో వేసినటువంటి ప్రతి 10గ్రాముల ఆవు నెయ్యికి 1టన్ను ఆక్సిజన్ విడులవుతుంది. భోగి మంటలలో ఆవు పిడకలు, ఔషధ చెట్ల బెరడులు, ఆవు నెయ్యి కాలిన తరువాత విడుదలయ్యే గాలి చాలా పవర్ ఫుల్. ఈ శక్తివంతమైన గాలి మన శరీరంలో అన్ని భాగాలకు సరఫరా అయ్యి టోటల్ బాడీ ని శుద్ధిచేస్తుంది. సో, మన ఆరోగ్యం కోసం ఇంతగా ఆలోచన చేసిన మన పెద్దలు గ్రేట్ అని పొగడక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: