తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ వస్తుందంటే కొన్ని రోజుల ముందు నుంచే గ్రామాలలో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. మూడు రోజుల పాటు చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో కోలాహలంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అయితే సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో భాగంగా మొదటిరోజు వచ్చే పండుగ భోగి. భోగి అంటే తొలినాడు అని అర్థం. భోగి పండుగ నాడు భోగి మంటలు వేసి... అందులో ఇంట్లోని పాత వస్తువులన్నీ మంటలు వేయడం ద్వారా దదారిద్యాన్ని తరిమి  కొట్టినట్లేనని ప్రజల నమ్మకం. తెల్లవారుజామున పిల్లలతోపాటు ఆడపడుచులు పెద్దలు అందరూ సూర్యుడు రాకముందే ముస్తాబై భోగి మంటలు వేసి  భోగి మంటల చుట్టూ ఆడిపాడుతు  ఉంటారు.

 

 

 భగ అనే పదం నుండి భోగి అన్నమాట పుట్టింది.  భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం. ఈ భోగి పండుగ రోజు ప్రతి చోట భోగి మంటలు కనిపిస్తూనే ఉంటాయి. భోగి పండుగకు సంబంధించి పురాణాల్లో కూడా ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భోగి అంటే సుఖం... పూర్వం ఈ రోజున శ్రీ రంగనాథ స్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది అని దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. భోగి పండుగ నాడు భోగి మంటలు వేస్తే మనుషుల్లోనే కామం క్రోధం ఈర్ష  అనే మలినాలు అన్నీ పోయి స్వచ్ఛంగా మారుతారని ప్రజలు నమ్ముతారు. అయితే ఈ భోగిరోజు వేసే మంటలు ప్రజలకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాయి.

 

 ఇక ఆధ్యాత్మిక పరంగా భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగిమంటల్లో కాల్చేసింది పాత వస్తువులను మాత్రమే కాదని మనసులోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలు... కామ క్రోధ ద్వేషాలు...పీడలన్నీ  పోయి మానసిక ఆరోగ్యం వస్తుందని ప్రజల నమ్మకం. సంక్రాంతి పండుగ ఈ భోగి మంటలతో మొదలై కనుమ పండుగ తో ముగుస్తుంది. కాగా  కృష్ణుడు ఇంద్రుని గర్వాన్ని అణచటానికి గోవర్థన పర్వతాన్ని ఎత్తిన పవిత్ర దినం రోజు భోగి జరుపుకుంటారు అని కొంత మంది భావిస్తూ ఉంటారు  అంతే కాకుండా శాపం కారణంగా రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనమైన నంది ని భూమికి పంపించిన రోజున భోగి పండుగ అనేది పురాతన గాద . ఇలా భోగి పండుగపై ఎన్నో పురాణగాధలు  ప్రాచుర్యంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: