హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అయ్యేది కూడా. అయితే శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది.

 

మంగళవారాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి, ఉపవాసముండి, హనుమంతుడిని ఆలయాన్ని దర్శించుకునే వారికి ఆర్థిక ఇబ్బందులు వుండవు. మానసిక ప్రశాంతత నెలకొంటుంది. “సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః.. హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః”.. అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. 

 

తైలంతో కూడిన గంధ సింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. అలాగే మంగళ లేదా శనివారాల్లో ఆలయాల్లో ఆంజ‌నేయుడిని దర్శించుకునే వారికి సకలసంపదులు చేకూరుతాయి. మ‌రియు శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: