కొత్త సంవత్సరంలో..కొత్త క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో మొదట వచ్చే పండుగ సంక్రాంతి. ఈ పండుగను భారతదేశమంతటా వేడుకగా, సంబరంగా సార్వజనీనంగా జరుపుకోవడం దాదాపు మూడు వేల ఏళ్ల నుంచీ వస్తోంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి తన ఉత్తర దిశ ప్రయాణాన్నికొనసాగించడం ఈ సంక్రాంతితోనే ప్రారంభం అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక ఫిక్డ్స్ డేట్ లో జరుపుకోవడం ఆచారంగాను, ఆధ్యాత్మికంగాను మారింది.

 

ఇది హిందువులకు అత్యంత పుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలం. వాతావరణపరంగా చూస్తే చలి కాలం నుంచి వేసవి కాలానికి కాలం మార్పు చెందడం ఈ సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఉదయ కాలం పెరుగుతూ, రాత్రి కాలం క్రమంగా తగ్గే కాలం ఇది. సంక్రాంతి ఆచార సంప్రదాయాలు, శాస్త్రీయ విజ్ఞానం, పర్యావరణం, వినోదం, వేడుకలు, సర్వప్రాణి హితం వగైరాలన్నీ కలగలసిన అపూర్వ, అద్భుత పర్వదినం.

 

కుటుంబాలు, స్నేహితులు, సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు పెంచడానికి ఈ పండుగ ఎంతగానో దోహదం చేస్తోంది. మానవ జీవితంలో సానుకూల, ఆశావాద, ఆరోగ్యకరమైన మార్పుకు కూడా ఈ వ్యవసాయ ప్రధానమైన పర్వదినం ఓ సంకేతం.మరి అటువంటి సంక్రాంతి రోజును కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా పొందుతారు.

 

అంతే కాదు, ఈ మకర సంక్రాంతి రోజున చేసే కొన్ని పనుల వల్ల అద్రుష్టం వరిస్తుంది. మరి మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా చేయాల్సిన పనులేంటో ఒకాసిరి చూద్దాం..మకర సంక్రాంతిని సూర్యునికి అంకితం కాబట్టి, ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, అభ్యంగన స్నానం చేయాలి. సూర్య నమస్కారంతో సూర్యునికి గంగను నివేధించాలి. మకర సంక్రాంతి రోజూను నువ్వులకు , బెల్లంకు ఎక్కువ ప్రాధాన్య ఉంది, వీటిని కొన్ని సాంప్రదాయ ఆహారా పదార్థాలను కూడా చేస్తుంటారు.

 

ఈ రోజును వీటిని ఖచ్చితంగా తినాలంటారు . వింటర్ సీజన్ లో వ్యాధినిరోధకత తక్కువగా ఉంటుంది. కాబట్టి, త్వరగా జబ్బుల భారీన పడుతుంటారు. అలా జరగకుండా శరీరంలో వేడి కలిగించే గుణాలు ఈ రెండింటిలో ఉండటం వల్ల వీటిని తప్పనిసరిగా తినాలనే ఆనవాయితి పూర్వకాలం నుండి ఉంది. బెల్లం చేర్చడం శరీరానికి ఇన్ స్టాంట్ ఎనర్జీని పొందుతారు.గ్రంథాల ప్రకారం, ఈ రోజున చేసే ధాన ధర్మాల వల్ల పుణ్యం లభిస్తాయని నమ్ముతారు.

అందుకే ఈ మూడు రోజుల్లో చేసే దానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అదృష్టం పొందాలంటే దుప్పట్లు, వెచ్చని దుస్తులు, వెన్న, తృణధాన్యాలు వంటివి దానం చేయడం వల్ల అదృష్టం పొందుతారు.ఇక ఈరోజున మరో ముఖ్యమైన సంప్రదాయం రంగు రంగుల గాలిపటాలను ఎగురవేయుట. కుంటుంబ సభ్యుల, స్నేహితులతో గాలిపటాలే ఎగురవేస్తూ..సంక్రాంతి సంబరాలను సంతోషంగా జరపుకోవడమే ఈ పండుగ ప్రత్యేకత..

మరింత సమాచారం తెలుసుకోండి: