సంక్రాంతి.. ఈ పండుగ అంటే ఎంతమందికి ఇష్టమే.. మూడు రోజులు జరిగే ఈ పండుగ ఎంతో ఆనందంగా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగకు ఎన్నో చోట్ల కోడి పంద్యాలు జోరుగా జరుగుతాయి. ఎక్కడైనా సరే కోడి పంద్యాలు జరపటం అంటే ఓ సరదా.. కామన్ విషయం. 

 

కానీ ఓ చోటా మాత్రం వింతగా పందుల పందేలు జరుగుతాయంట.. ఆ వింత మరెక్కడో కాదు.. మన అనంతపురంలోనే జరుగుతాయంట. గత సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తాడిపత్రిలో పందుల పందేలు నిర్వహించారట. కోడిపందేలు, పొట్టేళ్ళ పోటీలు, ఎద్దుల పందేలు చూసి ఉంటారు.. కానీ ఈ పందుల పోటీలేంటీ అనే ఆశ్చర్యం వేస్తుంది కదా. 

 

కానీ ఈ పందుల పందేలు గత సంవత్సరం తాడిపత్రిలో పెద్ద ఎత్తున జరిగాయట.. ఈ పోటీల్లో పాల్గొనేందుకు తమ తమ పందులను తీసుకుని వాటి యజమానులు తాడిపత్రికి తరలివచ్చారట. మహబూబ్‌నగర్, గద్వాల్, హిందూపురం, కల్యాణదుర్గం, కడప, బేతంచర్ల తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 మంది తమ పందుల్ని బరిలో దింపేందుకు తీసుకు వచ్చారట.

 

అయితే ఈ పందుల పోటీలు ఎలా జరుగుతాయంటే.. రెండు పందులు సుమారు అరగంటకు పైగా తలపడతాయి. ఈ విధంగా నిర్వహించే పోటీలో విజయం సాధించిన పందిని విజేతగా ప్రకటించి, దాని యజమానికి నగదు బహుమతి అందజేస్తారు. ఈ పందుల పోటీలు గత సంవత్సరమే మొదటి జరిగాయి.. మరి ఈ సంవత్సరం ఈ పోటీలు జరుగుతాయా లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: